37.2 C
Hyderabad
March 29, 2024 19: 55 PM
Slider గుంటూరు

ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ దిగ్భ్రాంతి

#Navataram Party

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని,400 మంది తీవ్రంగా

గాయపడ్డారు అని,900 మందికిగాయాలయ్యాయి అని వచ్చిన తాజా సమాచారం బాధాకరమని రావుసుబ్రహ్మణ్యం అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని

ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రైల్వే అధికారులతో చర్చించి బాధితులకు న్యాయం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించాలని నవతరంపార్టీ నుండి కోరుతున్నామన్నారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని తగిన

సహాయకచర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి నష్ట నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. నవతరంపార్టీ చిలకలూరిపేట కార్యాలయం నుండి ఈమేరకు ప్రకటన విడుదల చేసారు.

Related posts

విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గం

Satyam NEWS

రివార్డ్:రంజీత్ బచ్చన్ హంతకుల సిసిటివి ఫుటేజీ

Satyam NEWS

నేటి నుంచే మేడారం మహా జాతర

Satyam NEWS

Leave a Comment