37.2 C
Hyderabad
April 19, 2024 14: 33 PM
Slider గుంటూరు

యడవల్లి దళిత రైతుల భూములను సర్కార్ లాక్కోవడం అన్యాయం

#navataramparty

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నందున దళిత రైతులు 45 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న 223 ఎకరాల భూములను ప్రభుత్వ మార్కెట్ ధర చెల్లించి లాక్కొనేందుకు 16.09.2021 రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహారం కంచే చేను మేసినట్లుగా ఉందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉన్న యడవల్లి రైతుల భూములను గురించి కేబినెట్లో ఎలా తీర్మానం చేస్తారని ప్రశ్నించారు.కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం న్యాయస్థానం లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్షింతలు వేయించుకుని పరువును పోగొట్టునే నిర్ణయం గా మిగిలి పోతుంది అని సుబ్రహ్మణ్యం విమర్శించారు. మంత్రి పేర్ని నాని చేసిన ప్రకటన యడవల్లి దళిత రైతులకు గుండెల్లో బల్లెం తో పొడిచినట్లుగా ఉందని, భూములు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సిఫారసు చేయడం అన్యాయం గా ఉందని,అండగా ఉంటామని చెప్పి వెన్నుపోటు పొడవడం సరికాదని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.గతంలో ఇటువంటి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీని బహిరంగంగా విమర్శించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే యడవల్లి దళిత రైతులకు పట్టాలు ఇస్తామని ఓట్లు వేయించుకుని ఇప్పుడు కేబినెట్ సమావేశంలో 223 ఎకరాల భూములు లాక్కుని మోసం చేస్తారా?అని రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. కేబినెట్ తీర్మానం ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేశారు.రైతుల పొట్టకొట్టే పని జగన్మోహన్ రెడ్డి చేస్తారని ఊహించని యడవల్లి దళిత రైతులు జగన్ ముఖ్యమంత్రి కావాలని ఓట్లు వేసిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు.ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు రైతులు అందరూ అంగీకారాన్ని తెలుపకుండా, నష్టపరిహారం అందించకుండానే ఎలా ఒప్పగిస్తారని, తీర్మానం ఎలా చేస్తారు?అని ప్రశ్నించారు.మొత్తం 416 ఎకరాల భూమి ఏకపట్టా గా ఉండగా దళిత రైతుల మధ్య చీలికలు తీసుకువచ్చి విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్న 8 కోట్ల విలువైన ఎకరం భూమికి కేవలం 8 లక్షలు ఇచ్చి అన్యాయం న్యాయంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అని అన్నారు.కారుచౌక గా 223 ఎకరాలు 30 కోట్లకు తీసుకుని చిత్రపటానికి పాలాభిషేకం చేయించుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవాచేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఎకరానికి కనీసం కోటి రూపాయలు చెల్లించాలి అని న్యాయం గా డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి అని,మధు డిమాండ్ ప్రకారం చూసినా 223 ఎకరాలకు 223 కోట్లు చెల్లించాలని 30 కోట్లు చెల్లించి చేతులు దులుపుకోవడమేమిటని రావు సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.ప్రభుత్వానికి భూములు ఇవ్వడం ఇష్టం లేని యడవల్లి రైతులకు ఇప్పటికయినా పట్టాలు మంజూరు చేయాలని,లేని యెడల భూముల విలువ గ్రానైట్ భూముల ప్రకారమే లెక్కించి నష్టపరిహారం ఇవ్వాలని, లేదా గ్రానైట్ తవ్వుకుని అమ్ముకునే లా దళిత రైతులకు అనుమతులు ఇవ్వాలని జీవో విడుదల చేయాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.దళిత రైతులకు అండగా ఉంటామని తెలిపారు.

Related posts

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

Satyam NEWS

రిక్వెస్ట్: టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

Satyam NEWS

2022 Saw The Palmetto Reaction To High Blood Pressure And Cholesterol Medicine High Blood Pressure Alternative Remedies Effects Of Antihypertensive Drugs On Arterial Stiffness

Bhavani

Leave a Comment