39.2 C
Hyderabad
April 25, 2024 17: 47 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

నవయుగ బాబు లకు టెండర్ రద్దు

ap-cm-ys-jagan-mohan-reddy

చంద్రబాబునాయుడి హయాంలో పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్ననవయుగ కు ఆ కాంట్రాక్టును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నది. అదే విధంగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లను పిలిచేందుకు కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గం ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నది. 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు చంద్రబాబునాయుడి ప్రభుత్వం హెడ్ వర్క్స్ పనులు అప్పగించింది. రూ.3వేల కోట్ల విలువైన పనుల్ని నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. అయితే జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు తాజాగా ఇరిగేషన్ శాఖ సూచించింది. పోలవరం పనులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పోలవరం టెండర్లు, పనుల అప్పగింత, అంచనాల పెంపుతో అవినీతి జరిగిందని నివేదికలో పేర్కొంది. దీంతో నవయుగను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని జగన్ సూచించారు. అయితే ఈ నిర్ణయంపై నవయుగ కంపెనీ హైకోర్టు కు వెళ్లింది. అయితే రాష్ట్ర మంత్రి వర్గం నవయుగకు టెండర్లు రద్దు చేయాలని తాజాగా నిర్ణయించింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా నియమాలకు విరుద్ధంగా ప్రాజెక్టు వ్యయంలో 25శాతం మేర ఇచ్చిన రూ.780 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లను రికవరీ చేయాలని కూడా రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది. నవయుగకు టెండర్ ఇచ్చిన గత ప్రభుత్వ నిర్ణయాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆక్షేపించింది.

Related posts

ఈ నెల 6నుండి 13వరకు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

Satyam NEWS

బండి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం

Sub Editor

ఇండ్ల స్థలాలు కోసం 19న ధర్నా

Bhavani

Leave a Comment