28.7 C
Hyderabad
April 24, 2024 04: 41 AM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష

#navodayaschools

వట్టెం జవహర్ నవోదయ విద్యాలయ 9 వ తరగతిలో ప్రవేశానికి శనివారం నాడు  ఎంపిక పరీక్ష సజావుగా జరిగింది. మొత్తం నాగర్ కర్నూల్ జిల్లాలో 6 కేంద్రాలలో 1177 మందికి గాను 653 ( 55.48%) మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా 524 మంది గైర్హాజరయ్యారు.

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నవోదయ వట్టెం, లిటిల్ ఫ్లవర్, గీతాంజలి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 5 కేంద్రాలను జిల్లా విద్యా శాఖాధికారి  గోవింద రాజులు, అసిస్టెంట్ కమిషనర్  రాజశేఖర్ ,ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ లు పరిశీలించగా, కేంద్ర పరిశీలకులుగా  భాస్కరాచారి, మునీంద్రా,మను,వెంకట్ రెడ్డి,బాలాజీ,రీమా, నాగమణి లు వ్యవహరించారు.

ప్రవేశ పరీక్ష నిర్వాహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుండి విద్యార్థులు వారి తల్లి తండ్రులతో వచ్చి పరీక్షకు హాజరయ్యారు. కేవలం 3 ఖాళీ సీట్లలో ప్రవేశానికి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు పోటీ పడడం విశేషం.

Related posts

పెరుగుతున్న మానవ మృగాలతో సమాజానికి అరిష్టం

Satyam NEWS

తిరుమల వెళ్లే అలిపిరి కాలి మార్గం మూసివేత

Satyam NEWS

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Satyam NEWS

Leave a Comment