30.3 C
Hyderabad
March 15, 2025 10: 30 AM
Slider విశాఖపట్నం

అద్భుతంగా సాగిన నావీ డే విన్యాసాలు

#navyday

విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే విన్యాసాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నేవీ విన్యాసాలను చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్ ఆసక్తిగా తిలకించారు. నేవీ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, అత్యాధునిక వ్యవస్థలతో కూడిన లాంగ్ రేంజి యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ పీ8ఐ, నేవీ డోర్నియర్ విమానాలు, హాక్ జెట్ విమానాలు, సీకింగ్ హెలికాప్టర్లు, ఏఎల్ హెచ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. హెలికాప్టర్లు రకరకాలు ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అలరించాయి. చంద్రబాబు, భువనేశ్వరి, దేవాన్ష్ ఆ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో నేవీ బ్యాండ్ బీటింగ్ రిట్రీట్ కూడా ప్రదర్శించింది. ఇక, చీకటి పడ్డాక సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన యుద్ధ నౌకలు విద్యుత్ దీప కాంతులతో జిగేల్మన్నాయి. ఆ నౌకలను లైటింగ్ తో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు.

Related posts

ఎనాలసిస్: నీరస పడ్డ దేశానికి మళ్లీ మోడీ టానిక్

Satyam NEWS

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ విషయంలో ఘోర తప్పిదం

Satyam NEWS

అప్పుల బాధ తాళలేక ఉరివేసుకున్న వివాహిత

Satyam NEWS

Leave a Comment