28.7 C
Hyderabad
April 20, 2024 03: 07 AM
Slider నిజామాబాద్

నక్సల్బరీ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం

#Naxalbari movement

నక్సల్బరీ  పోరాటానికి  53  ఏండ్లు నిండిన సందర్భంగా స్థానిక సీపీఐ (యం. ఎల్)న్యూడెమోక్రసీ  పార్టీ కార్యాలయం (కుమార్ నారాయణ భవన్)లో అమర వీరులను స్మరిస్తూ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా  AIKMS రాష్ట్ర కార్యదర్శి V ప్రభాకర్ మాట్లాడుతూ 1967 మే 25 నక్సల్బరీ గ్రామంలో జమిందార్, ఆదివాసీ ప్రజల మధ్య జరిగిన పోరాటంలో ఏడుగురు మహిళలు,ఇద్దరు పులుషులు,ఇద్దరు పిల్లలు, మొత్తం 11 మంది అమరులయ్యారని ఆ పోరాట స్ఫూర్తితో శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు ముందుకు వచ్చాయని తెలిపారు.

నక్సల్బరీ పోరాట నిప్పురవ్వ దేశవ్యాప్తంగా వ్యాపించి ప్రజాపోరాటాలకు కు ఊపిరి ఇచ్చాయి అన్నారు. పీడిత ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అయ్యే అంతవరకు పోరాటాలు కొనసాగుతాయన్నారు. నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు నిర్మించాలన్నారు. అమరుల నెత్తుటి సాక్షిగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు B దేవారం  డివిజన్ అధ్యక్ష ,కార్యదర్శులు సురేష్, రాజేశ్వర్,జీలకర్ర నడ్పిన్న,కిషన్, గంగారం, రాజన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు

Satyam NEWS

షాక్ కొడుతున్నకరెంటు బిల్లులు

Satyam NEWS

కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారు

Bhavani

Leave a Comment