31.2 C
Hyderabad
April 19, 2024 04: 08 AM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో యాదవులపై నయీమ్ గ్యాంగ్ వరుస దాడులు

#bahujanaJAC

నయీమ్ ముఠా ఇంకా ఉందా? కచ్చితంగా ఉందని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో జరుగుతున్న భౌతిక దాడులు చేస్తుంటే అర్ధం అవుతున్నది. పేదవారిపై దాడులు చేయడం, వారి ఇళ్లను, స్థలాలను ఆక్రమించడం అదేమని ప్రశ్నిస్తే నయీమ్ ముఠా పేరు చెప్పడం… ఇదీ జరుగుతున్న తీరు. అదీ కూడా ఒక సామాజిక వర్గంపైనే దాడులు జరుగుతుండటంతో కొల్లాపూర్ లోని సాధారణ ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.

నియోజకవర్గంలోని యాదవులపై వరుసగా భౌతిక దాడులు జరగడం, ఆస్తుల ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బహుజన జేఏసీ ఆధ్వర్యంలో నేడు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. బహుజన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఆ తర్వాత ఆర్డిఓ, ఎమ్మార్వో, సీఐలకు యాదవులపై దాడులకు సంబంధించిన  రిప్రజెంటేషన్ ఇచ్చారు.

యాదవులపై నయీమ్ ముఠా పేరుతో వివిధ రకాల దాడులు ఆపకపోతే ప్రత్యక్ష సామాజిక యుద్ధం తప్పదని వారు హెచ్చరించారు. ఇటీవల మేకల రాముడు యాదవ్ ఆస్తులను ధ్వంసం చేసిన మాజీ నక్సలైట్ నయీమ్ ముఠాకు చెందిన వ్యక్తి అని చెప్పుకునే బ్యాగుల బాలయ్యను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు కట్టడి చేయాలని వారు ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గులపల్లి కృష్ణ యాదవ్,

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్, బహుజన జేఏసీ చైర్మన్ మేకల రాములు యాదవ్, బహుజన జేఏసీ కన్వీనర్లులు మద్దేల  రాందాస్ , బచ్చలకూర బాలరాజు, తోకల రాము యాదవ్, మేకల భాస్కర్ యాదవ్, కంది  నరసింహ యాదవ్, మేకల కృష్ణయ్య యాదవ్, నాగరాజ్ యాదవ్, అప్పల మాసయ్య యాదవ్, కౌన్సిలర్ రాముడు యాదవ్, రెడ్డి రమేష్ యాదవ్, నాగులపల్లి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ బీరయ్య యాదవ్, అమరగిరి సర్పంచ్ స్వామి యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, యాదవ జేఏసీ చైర్మన్ బారిగేల బాలయ్య యాదవ్, మాజీ వార్డు మెంబర్  వేణుగోపాల్ యాదవ్, యాదవ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ యాదవ్, ఎల్లయ్య యాదవ్, నాగేంద్ర యాదవ్, నాగరాజు యాదవ్, శంకర్ యాదవ్, గంగులు యాదవ్, యాదవ జాగృతి సేన మండల ప్రచార కార్యదర్శి దాసరి సాయి కుమార్ యాదవ్, అమరగిరి భరత్ యాదవ్ తదితర సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన కాయకల్ప బృందం

Satyam NEWS

మహారాష్ట్ర పాలిటిక్స్: మళ్లీ కదులుతున్న ముళ్ల కంప

Satyam NEWS

ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి

Satyam NEWS

Leave a Comment