నందమూరి బాలకృష్ణ కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి రాయల సింహ అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జై సింహ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇంకా అధికారికంగా పేరు పెట్టని ఈ చిత్రంలో సోనాలీ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ నందమూరి ఫ్యాన్స్ ని మాత్రమే కాకుండా సినీ అభిమానులని కూడా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడా అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటే సన్ నెట్వర్క్ జెమినీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వేసి అందరికీ షాక్ ఇచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ డిసెంబర్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసిన జెమినీ టీమ్, దీనితో పాటు టైటిల్ ని కూడా లీక్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాకి ఒక్క ట్వీట్ తో రూలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని లీక్ చేసిన జెమినీ, కాసేపటి తర్వాత ఆ ట్వీట్ ని మళ్లీ డిలీట్ చేశారు. అయితే ఆ తర్వాత చిత్రానికి రాయల సింహ అని నామకరణం చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది.