27.7 C
Hyderabad
April 25, 2024 10: 29 AM
Slider విజయనగరం

కారు వైప‌ర్ ద్వారా రాబ‌రీని చేధించిన నెల్లిమ‌ర్ల పోలీసులు…!

#nellimarlapolice

అయిదురోజుల క్రితం జ‌రిగిన రాబ‌రీకేసులో నిందుతుల‌ను ఓ హోం గార్డు ప‌ట్టించారంటే న‌మ్ముతారా…? న‌మ్మాల్సిందే. అందుకు స్వ‌యంగా స‌ద‌రు హోంగార్డ్స్ ను  విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ ..రివార్డు ఇచ్చిమ‌రీ సత్క‌రించారు.

వివ‌రాల్లోకి వెళితే. …ఈ నెల 19 న విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెల్లిమ‌ర్ల పీఎస్ ప‌రిధిలో రామ‌తీర్దం దారిలో బొప్ప‌డాం గ్రామ స‌మీప‌న‌…స‌తివాడ గ్రామ శివారు మ‌ధుపాడ వ‌ద్ద త‌న వంటిమీద రెండున్న‌రు తులాల‌ను ఇద్ద‌రు వ్య‌క్తులు అప‌హ‌రించుకు వెళ్లారంటూ  నెల్లిమ‌ర్ల పీఎస్ కు..ఏడుప‌దుల వ‌యస్సున్న పెద్దావిడ వ‌ర‌హాల‌మ్మ ఫిర్యాదు చేసింది.

దారి దోపిడీ కేసుగా అదేనండీ రాబ‌రి కేసు గా న‌మోదు కావ‌డంతో…విచార‌ణ కోసం..విజ‌య‌న‌గ‌రం స‌ర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ మంగ‌వేణి రంగంలోకి  దిగారు.ఇటీవ‌లే విజువ‌ల్ పోలీసింగ్ చేస్తున్న స‌మ‌యంలో…సీసీ క‌మారాలు, హావాక్ వెహికిల్స్ ద్వారా  విచార‌ణ‌నుమొద‌లు పెట్టారు..సీఐ మంగ‌వేణి బృందం. దీంతో  హోంగార్డులు మూసా,శ్రీనులు…సీసీ పుటేజ్ లోగుర్తించిన ఆటోకు..కారు వైప‌ర్ ఉండ‌టం..అలాగే  ఓమ‌హిళ పేరు రాసి ఉండ‌టంతో…ఆ దిశగా ఇద్ద‌రూ ప‌రిశోధ‌న చేసి..విశాఖ జిల్లా  ప‌ద్మ‌నాభం, జామి కు చెందిన ఇద్ద‌రు నిందితుల‌ను ఈ రాబ‌రీ కి పాల్ప‌డిన‌ట్టు గుర్తించిన వెంట‌నే ఎస్ఐ ర‌వీంద్ర రాజు కు చెప్ప‌డంతో..పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేసిన‌పోలీసులు.. నాలుగు రోజుల త‌ర్వాత ఆ ఇద్ద‌రు నిందితుల‌ను మీడియా ముందు ప్ర‌వేశ పెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ అనిల్ మీడియాతో మట్లాడుతూ…ఇటీవ‌ల ఎస్పీ దీపిక ఆదేశాల‌తో విజువ‌ల్ పోలీసింగ్,అలాగే హ‌వా  వెహికిల్స్ ద్వారా…చాలా చోట్ల  పెట్టిన సీసీ పుటేజ్ ల‌తో కేసుల‌ను ఇట్టే చేధించ గ‌లుగుతున్నామ‌ని చెప్పారు.ఇందులో భాగంగానే రెండున్న‌ర తులాల బంగారం రోబ‌రీ కేసులోఇద్ద‌రు నిందితుల‌ను అలాగే త‌మ సిబ్బంది ప‌ట్టుకున్నార‌ని డీఎస్పీ తెలిపారు. ఈ మీడియా స‌మావేశంలో రూర‌ల్ సీఐ మంగవేణి ,నెల్లిమ‌ర్ల ఎస్ ఐ రవీంద్ర‌రాజు, పీసీ సురేష్ లు ఇద్ద‌రు హోం గార్డులు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

మధ్యతరగతిపై పిడుగు: మారని ఆదాయపు పన్ను శ్లాబ్ లు

Satyam NEWS

క్వింటా ఒక్కింటికి 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి

Satyam NEWS

దొంగలు బాబోయ్ దొంగలు

Satyam NEWS

Leave a Comment