18 C
Hyderabad
November 27, 2020 22: 40 PM
Slider నెల్లూరు

అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం చారిత్రాత్మకం

#NelloreTDP

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం 250 వ రోజుకు చేరుకున్న సందర్భంగా నెల్లూరు తెలుగుదేశం పార్టీ సంఘీభావం వ్యక్తం చేసింది.

2019 డిసెంబరు 17 వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటన చేసిన మరుసటిరోజు నుండి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 250 వ రోజుకి చేరుకుందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నించినా, లాఠీలతో కొట్టించినా,అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినా, లాక్ డౌన్ వచ్చినా చలించక మొక్కవోని దీక్షతో చేస్తున్న అమరావతి ఉద్యమం చారిత్రాత్మక ఉద్యమం అని ఆయన అన్నారు.

మాట తప్పని,మడమ తిప్పని వంశం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అమరావతిలో రాజధానిని కొనసాగిస్తానని చెప్పి ఈరోజు మాటమార్చారని ఆయన అన్నారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని కాదని విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తే రాయలసీమ, నెల్లూరు కు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

దేశంలోని పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ కు ఒక రాజధాని ఉంటే అతి చిన్న రాష్ట్రామయిన ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఎందుకో ఎవరికి అర్ధం కావడం లేదు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాల వలన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు,అన్ని వర్గాల ప్రజలు రాజధాని అమరావతి లోనే ఉండాలని కోరుకుంటున్నారని, అందువల్ల ఇప్పటికైనా తన ఆలోచనలు మార్చుకొని రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు  ఏలూరు కృష్ణయ్య, పెనుమల్లి శ్రీహరి రెడ్డి, ఇందపురు మురళీకృష్ణారెడ్డి, SK నాజీర్, మహ్మద్, పూల వెంకటేశ్వర్లు, మారుబోయిన వెంకటేశ్వర్లు, కొక్కంటి గోపాలకృష్ణ,కె నారాయణ రెడ్డి,మామిడి మురళీకృష్ణ, పాలూరు వెంకటేశ్వర్లు గరికిపాటి అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నో సొల్యూషన్: కిరోసిన్ డబ్బాలతో కలెక్టరేట్ ఎక్కిన రైతులు

Satyam NEWS

కరోనాలోనూ వైసిపి కుంభకోణాలు-కక్ష సాధింపు గర్హనీయం

Satyam NEWS

పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చిన రాములమ్మ

Satyam NEWS

Leave a Comment