18 C
Hyderabad
November 27, 2020 22: 11 PM
Slider నెల్లూరు

రాజ‌ధాని రైతులకు సంఘీభావంగా కదం తొక్కిన తెలుగు త‌మ్ముళ్లు

#NelloreTDP

రాజ‌ధాని రైతుల దీక్షలు 300రోజుల‌‌కు చేరిన సంద‌ర్బంగా నెల్లూరు పట్టణంలో నగ‌ర ఇన్చార్జి కోటంరెడ్డి ఆధ్వ‌ర్యంలో విఆర్సీ సెంట‌ర్ నుంచి న‌రక్తి సెంట‌ర్ వ‌ర‌కు భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ నిర్వహించారు.

ముఖ్య అతిధిగా నెల్లూరు పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్షులు అబ్దుల్అజీజ్ హాజరయ్యారు. రాజ‌ధాని రైతుల త్యాగాల‌ను సీఎం జ‌గ‌న్ అవ‌మాన‌ప‌రుస్తున్నాంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం జ‌గ‌న్ సైకోల వ్య‌వ‌హ‌రిస్తున్నాంటూ న‌గ‌ర ఇన్చార్జి కోటంరెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ఇన్ని రోజులు దీక్షలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని కోటంరెడ్డి అన్నారు. వంద‌లాది మంది యువ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించామని తెలిపారు. రాజ‌ధాని రైతుల కోసం టీడీపీ ఎందాకైనా పోరాడుతుందన్నారు.

చంద్ర‌బాబునాయుడి స‌మ‌ర్ద‌త‌ను న‌మ్మి రైతులు వేల ఎక‌రాలు ఇస్తే,సీఎం జ‌గ‌న్ ద‌ద్ద‌మ్మ‌లా ప్ర‌వ‌ర్తిస్తున్నాడన్నారు. రైతుల త్యాగాల‌ను జ‌గ‌న్ త‌న‌ బినామీల‌కు కోసం ప‌ణ్ణంగా పెట్టాడని ఆరోపించారు. అమ‌రావ‌తిని సీఎం జ‌గ‌న్ ఇంచి కూడా క‌ద‌లించ‌లేరన్నారు.

సీఎం జ‌గ‌న్ కొమ్ములు వంచుతాం, టీడీపీ నేత‌ల సత్తా ఏంటో నిరూపిస్తామన్నారు. మ‌రో రెండేళ్లలో టీడీపీ అధికారంలోకిరాబోతుంది, చంద్ర‌బాబునాయుడు సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే, అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తామన్నారు.

టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం రైతులు 40 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగిస్తే వారి త్యాగాన్ని సీఎం అవమన పరుస్తున్నారన్నారు.

మహిళా రైతుల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒంటెద్దు పోకడలు అవలభిస్తున్నారని, రాష్టాన్ని మూడు ముక్కలు చేసి లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.

Related posts

పోలీసు వ్యాన్ సైరన్ విని ప్రాణాలు హరీ అని

Satyam NEWS

ఆర్టీసీ బస్సుల్ని అడ్డుకుంటే క్రిమినల్ కేసులు

Satyam NEWS

ఆలోచన ఆగదు అడుగు ముందుకు పడదు

Satyam NEWS

Leave a Comment