28.7 C
Hyderabad
April 25, 2024 05: 42 AM
Slider సినిమా

నటిగా నాకంటూ ఓ చిన్న స్థానం కోసం

#VanisreeKumar

“పుష్పక విమానం లాంటి చిత్ర సీమలో నాకంటూ ఓ చిన్న స్థానం దక్కించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను” అంటున్నారు వర్ధమాన నటీమణి వాణిశ్రీకుమార్.

‘నేల టికెట్, నేనే ముఖ్యమంత్రి, కవచం, ఒక్క అమ్మాయి తప్ప’ వంటి చిత్రాలతోపాటు… పలు ధారావాహికల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి తన ఉనికిని ప్రకటించుకున్నారామె.

చదువుకునే రోజుల్లో హీరోయిన్ అవ్వాలని కలలు కన్న వాణిశ్రీ… వివాహానంతరం ఆ కలలకు కామా పెట్టి… గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించారు.

ఇప్పుడు తన భర్తను ఒప్పించి… హీరోయిన్స్ కి అక్క, అత్త, వదిన వంటి పాత్రలు చేసి మెప్పించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

నిడివితో నిమిత్తం లేకుండా… అసభ్యత-అశ్లీలతలకు తావులేని పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలన్నది తన అభిలాష అని చెబుతున్నారు వాణిశ్రీకుమార్.

Related posts

ట్రెడిషన్: ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు

Satyam NEWS

ఓ గాడ్: కోవిడ్ ఆసుపత్రి నుంచి రోగి మాయం

Satyam NEWS

గోమాతకు గ్రాసం అందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment