35.2 C
Hyderabad
April 20, 2024 17: 37 PM
Slider నల్గొండ

కార్పోరేట్ సంస్థల కోసమే ఈ కొత్త వ్యవసాయ చట్టాలు

#NewAgricultureAct

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్సు లు తెచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి విమర్శించారు.

ఆదివారం నాడు నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల లోని స్థానిక మేకల లింగయ్య స్మారక భవనం లో ఏర్పాటు చేసిన పార్టీ పట్టణ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

గత నెల రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన, పోరాటాలు ఉధృతంగా చేస్తున్నా కొత్త చట్టాలను రద్దు చేయకపోవడం విచారకరమని అన్నారు.

రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేసే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కేరళ ప్రభుత్వం తరహాలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, మద్ది లింగయ్య,

రుద్రారపు పెద్దులు, ఐతరాజు యాదయ్య, ఏళ్ళ మారయ్య, అక్కనపల్లి నాగయ్య, మేడి సుగుణమ్మ, బండారు శంకరయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

New Challenge: మంకీపాక్స్ అంటే?

Satyam NEWS

కీచక ప్రిన్సిపల్ నాంపల్లి హెడ్ ఆఫీస్ కు అటాచ్

Satyam NEWS

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించండి

Satyam NEWS

Leave a Comment