నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా తయారు చేసిన బోటును ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి నేడు పరిశీలించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం సోమశిల నుండి కృష్ణానదిలో శ్రీశైలం వెళ్ళడానికి పర్యాటక శాఖ నూతనంగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో దీనిని తయారు చేయించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లాపూర్ ప్రాంత పర్యాటక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అందులో భాగంగా ఈ బోటును 14 తేదీ న పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధారాణి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆసుపత్రి చైర్మన్ కాటం జమలయ్య కో ఆప్షన్ నెంబర్ అరుణ్ భాష టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ చారి బండ వెంకటస్వామి మూల కేశవులు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి రాఘవేందర్ వాసు తదితరులు పాల్గొన్నారు.
previous post