34.2 C
Hyderabad
April 23, 2024 14: 31 PM
Slider కర్నూలు

శ్రీశైలంలో కరివెన నిత్యాన్నదాన సత్రం నూతన భవనానికి శంఖుస్థాపన

#karivena satram

కర్నూలు జిల్లా శ్రీశైలంలో వున్న ప్రముఖ బ్రాహ్మణ సేవా  సంస్థ  కరివెన నిత్యాన్నదాన సత్రం నూతన భవనానికి జులై 4 ఆదివారం భూమిపూజ కార్యక్రమం  వేడుకగా జరిగింది.  అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేన నిత్యాన్నదాన సత్రం 1899 సంవత్సరంలో శ్రీశైలంలో  ప్రారంభించారు.

అప్పటి నుంచి నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు సత్రంలో సేవలు అందిస్తున్నారు. సత్రం నిర్మించి వంద సంవత్సరాలకు పైగా కావటంతో పాటు, శిథిలావస్థకు చేరటంతో  శ్రీశైల క్షేత్రానికి రోజు రోజుకు వచ్చే భక్తుల సంఖ్యా పెరుగుతుండటంతో మరింత మందికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో కరివెన  నిత్యాన్నదాన సత్రం లో నూతన భవనం నిర్మించాలని పాలకవర్గం నిర్ణయించింది.

అందులో భాగంగా ఆదివారం  సంస్థ ప్రధా న కార్యదర్శి నవులూరు వేణుగోపాల్ , మీరా దంపతులు భూమిపూజను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  శ్రీశైల దేవస్థాన ఈ ఓ రామారావు,   సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్, మేఘా ఇంజినీరింగ్ డైరెక్టర్ ప్రదీప్, కామరాజు నరేంద్ర , రామకృష్ణ, చిదంబరం తదితరులు పాల్గొన్నారు. వేదపండితులు నాగరాజ శర్మ, వేదం విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య భూమిపూజ జరిగింది.  

ఈ సందర్భంగా  సంస్థ ప్రతినిధి ప్రదీప్ మాట్లాడుతూ ఏడాదిన్నరలో భవన నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 120 సంవత్సరాల క్రితం కరివేన  సత్రం భక్తులకు సేవలు అందించటం ప్రారంభించిందని అన్నారు.

భక్తులకు భోజన, వసతి  సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. నూతనంగా   45 వేల చదరపు అడుగుల వైశాల్యంతో అధునాతనంగా భవనం నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవలే  త్రిపురాంతకం లో”చక్రాసిమెంట్”వారి భవనంలో”నూతనంగా కరివెనసత్రం ప్రారంభంమైందని,  శక్తి పీఠాల్లో ఒకటిగా పేరొందిన “జోగులాంబ అమ్మవారి”బాలబ్రహ్మేశ్వర స్వామి వారి సన్నిధిలో మరొసత్రం నెలకొల్పామని చెప్పారు. 

త్వ రలోనే యాదాద్రి లో, అరుణాచలం లో కూడా స్థలసేకరన  చేసి భక్తుల సౌకర్యార్థం అన్నదాన సత్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Related posts

శాంతి భద్రతల పరిరక్షణలో కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం

Satyam NEWS

ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న జగన్: ఇప్పుడు మరో ఆశ్రమం

Satyam NEWS

హ్యాట్సాఫ్ : ఉదారత చాటుకున్న అక్క చెల్లెళ్లు

Satyam NEWS

Leave a Comment