40.2 C
Hyderabad
April 24, 2024 16: 49 PM
Slider నల్గొండ

నూతన కార్మిక భవనం కార్మికులకు ఆధునిక దేవాలయం కావాలి

#NewBuilding

నూతన కార్మిక భవనం, నిర్మాణ కార్మికులకు అండగా ఉండే ఆధునిక దేవాలయం లాంటిదని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సాయి బాబా  థియేటర్ వెనక భాగం తెలంగాణ శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (CITU అనుబంధం) సొంత స్థలంలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు.

ఈసందర్భంగా పట్టణ, మండల కమిటీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి సొంత బిల్డింగ్ కట్టుకోవాలన్న కార్మికుల కల నెరవేరే సమయం ఆసన్నమైందని, ప్రతి కార్మికుడికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ భవనానికి వచ్చి సంఘ నాయకులతో తమ తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది ఆధునిక దేవాలయం కావాలని అన్నారు.పట్టణ కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపినారు.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల చిరకాల కోరిక ఈరోజు తీరుతుందని అన్నారు.

ఈనెల 13న,  ప్రభుత్వ విధానాలు, నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అనే అంశంపై రాష్ట్ర సదస్సు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని,జిల్లా వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

14,15 తేదీలలో మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గోవిందు, కార్యదర్శి షేక్ ముస్తాఫా, పట్టణ అధ్యక్షుడు, కోశాధికారి నరేష్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ ,కర్నె నాగయ్య, వల్లెపు నాగరాజు వేముల బాలకోటయ్య, బండి గోపి, గుండెబోయిన వెంకన్న, కోటమ్మ, సైదులు, సాయి, కొండలు, రాజు, రాకేష్, అశోక్, నరసింహారావు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మండల ఆర్.ఎమ్.పి(రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సంఘం సమావేశం

Satyam NEWS

ఎస్సై పైకి కారు పోనిచ్చిన వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

“తిరుపతి జిల్లా” గా పేరు మార్చాలి

Satyam NEWS

Leave a Comment