28.7 C
Hyderabad
April 17, 2024 05: 21 AM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

ravi

టీవీ9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రవిప్రకాష్ ను ఎట్టిపరిస్థితుల్లో జైల్లో నుంచి విడుదల చేయించరాదని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఆయనపై మరో కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్ పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద  ఫేక్ ఐడి  కార్డు ను రవి ప్రకాష్ క్రియేట్ చేసినట్లు తాజా ఆరోపణ. ఈ ఆరోపణతో 406/66  ఐటీ  యాక్ట్ కింద కేసు నమోదు  చేశారు. చంచల్ గూడ జైలు నుండి పిటి వారెంట్ ద్వారా  మియాపూర్ కోర్ట్ కు  పోలీసులు ఆయనను తరలిస్తున్నారు. రవిప్రకాష్ పై గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. అలందా మీడియా షేర్ల బదలాయింపు నకు సంబంధించిన ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ కేసులకు సంబంధించి రవిప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేసే వీలులేకపోయింది. హైకోర్టులో కేసు దాఖలు కావడం తదితర అంశాలతో రవిప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. రవిప్రకాష్ రూ.18 కోట్లు దుర్వినియోగం చేసినట్లు మరో ఫిర్యాదు అందడం తో ఆగమేఘాలపై పోలీసులు రవిప్రకాష్ ను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా సాక్ష్యాలు సేకరించాల్సి ఉన్నందున తమ కష్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా నాంపల్లి కోర్టు దాన్ని తిరస్కరించింది. ఇదే సమయంలో ఆయన పై తదుపరి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర హైకోర్టు సూచించింది. ఈ రెండింటి నేపథ్యంలో రవిప్రకాష్ పై మరో కేసు నమోదు చేశారు. ఈ సారి రవిప్రకాష్ పై ఐటీ యాక్ట్ కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

ఒక పోలీసు చెప్పిన కథ: అన్నం శ్రమ జీవుల కష్టం

Satyam NEWS

న్యూ కాంట్రవర్సీ: షిర్డీ సాయి బాబాపై కొత్త వివాదం

Satyam NEWS

వెంకన్న పింక్ డైమండ్ కథ కంచికేనా?

Satyam NEWS

Leave a Comment