27.7 C
Hyderabad
April 20, 2024 02: 51 AM
Slider మహబూబ్ నగర్

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ యాస్మిన్ భాష

#yasmeen-basha

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది పాఠకులకు విదితమే. కాగా ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష కు అదనపు బాధ్యతల ను అప్పగించారు. నేటి ఉదయం చార్జింగ్ అప్పగించి శ్రీ ధర్ రిలీవ్ అయ్యారు.

సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్  యాస్మిన్ భాష నాగర్ కర్నూలు జిల్లా  కలెక్టర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రజల ఆరోగ్యం హరితహారం, స్మశాన వాటిక ల నిర్మాణాలు, డంపింగ్ యార్డులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భూసేకరణ అప్ డేషన్ తదితర అంశాలపై దృష్టి సారించినునృట్లు ఆమె తెలిపారు. త్వరలోనే జిల్లా అధికారులతో జిల్లా ప్రగతి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు యాస్మిన్ భాష తెలిపారు అనంతరం సి టి సి పై సంతకాలు చేశారు

Related posts

టర్కీకి దీటుగా సమాధానమిచ్చిన ఎస్ జైశంకర్

Satyam NEWS

ముస్లిం సోదరులకు ఉత్తమ్ బక్రీద్ శుభాకాంక్షలు

Satyam NEWS

రాజధాని కాదు ఇది రాజస్థాన్ ఎడారి

Satyam NEWS

Leave a Comment