మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంపై కొత్త వివాదం ముసురుకుంటున్నది. నరసింహారెడ్డి వారసులకు సాయం చేస్తామని మాటిచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్ మాట తప్పిందని ఆ వంశస్తులు ఆరోపిస్తున్నారు. తమను ఆదుకుంటామని మాయమాటలు చెప్పారని వారు అంటున్నారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. దొరవారి నరసింహారెడ్డి అలియాస్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులమైన మేము, సైరా పేరుతో మా వంశ మూలపురుషుడి చరిత్రతో సినిమా చేస్తూ వ్యాపారం చేసుకుంటున్న కొణిదెల ప్రొడక్షన్స్ వారు, మాకు సహాయం అందిస్తామని మాటిచ్చి తప్పినందుకు, అలాగే మమ్ము పలువిధాలుగా అవమానించి, మానసిక క్షోభకు గురిచేసినందుకు తీవ్ర నిరసన తెలుపుతున్నామని దొరవారి దస్తగిరి రెడ్డి( మొబైల్ : 94419 84199) ఒక ప్రకటనలో తెలిపారు.
previous post
next post