24.7 C
Hyderabad
March 26, 2025 10: 33 AM
Slider ప్రత్యేకం

జగన్‌ 2.Oకి కొత్త నిర్వచనం ఇచ్చిన మంత్రి….!!

#jagan

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ 2.O వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి.. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జగన్‌ కామెంట్స్‌పై పంచ్‌లు పేలుస్తున్నారు.. జగన్‌ 2.Oకి వైసీపీ నేతలు బ్రాండింగ్‌ ఇచ్చుకోవడానికి ఫోకస్‌ చేస్తుంటే, టీడీపీ సీనియర్‌ నేత, మంత్రి డోలా బాల వీరాంజనేయులు కొత్త నిర్వచనం ఇచ్చారు. జగన్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, ఆయన 2.O అంటే మార్పు కాదని, అది జీరో అని ఓ కాదని కౌంటర్‌ ఇచ్చారు.. అంటే, ప్రస్తుతం జగన్‌ పవర్‌ జీరో అని చెప్పకనే చెప్పారని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

2024 ఎన్నికలలో జగన్‌కి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.. ఆయనకు కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.. ఇటు లోక్‌ సభ ఎన్నికలలోనూ వైసీపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితం అయింది.. ఆ పార్టీకి దారుణంగా ఓడిపోయింది.. దీంతో, నిన్నటివరకు ఇటు ఏపీలో, అటు ఢిల్లీలో చక్రం తిప్పిన జగన్‌కి సీన్‌ అర్ధం అయింది..  వైసీపీ నుండి వరసగా నేతలు గుడ్‌ బై చెబుతున్నారు.. ఫ్యాన్‌ రెక్కలు విరిగిపోతున్నాయి.. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు జగన్‌కి టాటా చెప్పారు..

ఇటు, ఎమ్‌ఎల్‌ఏ స్థాయి నేతల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలే కానీ, నిముషాలలో జంపింగ్‌ జపాంగ్ రాగం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారనేది ఓపెన్‌ ఫ్యాక్ట్‌.. జగన్‌ జీరో అయిన సంగతి ఆయనకు కూడా తెలుసు.. అందుకే, గత కొన్ని రోజులుగా ప్రకటించిన విద్యా పోరుని వరసగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.. విద్యార్ధులకి సుమారు 3 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పెట్టి చెల్లించకుండా వెళ్లిపోయాడు జగన్‌.. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత వాటిని చెల్లిస్తోంది.. ఇటు, విద్యా వ్యవస్థలో మార్పులు చేర్పులు, అంతర్జాతీయ సిలబస్‌, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్‌ లాంటి ప్రయోగాలతో వేల కోట్ల అవినీతి జరిగిందని లెక్కలు చెబుతున్నాయి..

ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయడంలో చంద్రబాబు సర్కార్‌ సక్సెస్‌ అయింది.. వైసీపీ జీరో అయిందని తెలిసినా, పైకి మాత్రం బీరాలు పలుకుతున్నాడు జగన్‌.. రాబోయే 30 ఏళ్లు తానే అధికారంలో ఉంటానని, ఇక భవిష్యత్తు తనదే అని స్వయంగా ప్రకటించుకున్నారు వైసీపీ అధినేత. తాను మారిపోయానని, రాబోయే రోజుల్లో తన 2.O చూస్తారని ఆవేశంగా స్పీచ్‌ ఇచ్చారు. ఆ మార్పు జగన్‌లో కాదు, ప్రజల్లో వచ్చిందని, అందుకే, ఆయన జీరో అయ్యారని ఎద్దేవా చేస్తున్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయులు.. మంత్రి గారి టైమింగ్‌కి టీడీపీ సోషల్‌ మీడియాలో మంచి మార్కులు పడుతున్నాయి..

Related posts

ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీరేదెన్నడు ?

Satyam NEWS

ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షాపుల్లర్స్ !

Satyam NEWS

దిగ్విజయంగా రెండో వారంలోకి ఆదిపర్వం

Satyam NEWS

Leave a Comment