39.2 C
Hyderabad
March 29, 2024 16: 00 PM
Slider విజయనగరం

పోలీసులలో కొత్త స్ఫూర్తిని నింపిన అమర వీరుల దినోత్సవం

#deepikaips

పోలీస్ అమ‌ర‌వీరుల దినోత్స‌వం.దేశం కోసం,స‌మాజం కోసం త‌మ ప్రాణాల‌ను తృణ‌ప్రాయంగా పెట్టిన పోలీస్ జ‌వాన్ల స్మృతిని స్మ‌రిస్తూ ప్ర‌తీఏటా పోలీస్ శాఖ నిర్వ‌హిస్తున్న రోజు అక్టోబ‌ర్ 21.  ఈ పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వానికి  హాజ‌రైన‌ క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ,ఎస్పీ దీపికలకు తొలిసారి కావ‌డం విశేషం.ఒక‌రు రాణీ రుద్ర‌మ‌దేవీ..ఇంకొక‌రు ఝాన్సీ ల‌క్ష్మీభాయి అన్న‌చందంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ,ఎస్పీ దీపిక‌లు…ఇద్ద‌రూ త‌మ‌,తమ శాఖ‌ల‌లో  తీసుకుంటున్న చ‌ర్య‌ల ప‌రంగా చేప‌డుతున్నకార్య‌క్ర‌మాల పరంగా ఒక రకంగా  వ‌ణుకు,మ‌రో ర‌కంగా  శాఖాసిబ్బంది ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

తాజాగా జిల్లా కేంద్రంలోని ప‌రేడ్ గ్రౌండ్ మైదానంలో స్మృతి వ‌నంలో జ‌రిగిన  పోలీసుల అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వంలో ముఖ్యఅతిథిలుగా హాజ‌రై  తాము ఇచ్చిన ప్ర‌సంగాల‌తో పోలీసు జ‌వాన్ల‌లో మ‌రింత స్పూర్తిని నింపారు.స‌రిగ్గా ఉద‌యం 8 గంట‌ల‌కు అనుకున్న స‌మయానికే స్మృతి మైదానానికి ఎస్పీ ,క‌లెక్ట‌ర్లు వ‌చ్చారు. అంత‌కు ముందే ఏఆర్ డీఎస్పీ శేషాద్రి…అతిధుల‌ను సాద‌రంగా ఆహ్వానించారు.

శాఖా పరంగా ఎస్పీ  దీపికాకు పోలీసుల అమ‌ర‌వీరుల దినోత్స‌వం గురించి తెలిసినా…విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  జ‌రుగుతున్న ఈ దినోత్స‌వానికి తొలిసారిగా హాజ‌ర‌వ్వ‌డం విశేషం.అటు జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ కూడ‌…తొలిసారి కావ‌డం కూడా విశేష‌మ‌నే చెప్పాలి.తొలుత ఎస్పీ దీపికా మాట్లాడిన మాట‌లు..సిబ్బందిలో మ‌రింత స్పూర్తిని నింపాయ‌నే చెప్పాలి.

సాదార‌ణ ప్ర‌జానీకంతో పాటు సిబ్బంది స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వినేందుకు ప్ర‌తీ వారం స్పంద‌న పెట్ట‌ న్న‌ట్టు చెప్పి మ‌రీ…శాఖా  సిబ్బందికి ద‌గ్గ‌రై వాళ్ల‌లో మ‌రింతా వృత్తి పట్ల అంకిత భావం పెంపొందేలా మాట్లాడారు.ఇక క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ అయితే…అధికారులంతా గాజు భ‌వ‌నాల‌లో ఉంటున్నామే త‌ప్ప‌…బ‌య‌ట ఉద్యోగాలు చేస్తున్న‌వారిని ఒక్క‌సారి గా గుర్తుకు తెచ్చుకోవటం లేద‌న్న భావం వ‌చ్చే విధంగా త‌న ప్ర‌సంగంలో మాట్లాడారు.

ఎండ‌న‌న‌క‌,వాన‌న‌క‌, ఎన్ని అవాంత‌రాలు, ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా రోడ్ల‌మీద ప‌లు కూడ‌ళ్ల‌లో విధులు నిర్వ‌హిస్తున్న వృత్తి గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు. ప్ర‌తీ ఒక్క కుటుంబంలో ప్ర‌తీ చిన్న పిల్లాడు పోలీస్  అవుతాన‌ని చెప్ప‌డం  తాను చాలా సంద‌ర్భాల‌లో చూసాన‌ని క‌లెక్ట‌ర్ చెప్ప‌డం విశేషం. ఇక ఈ సారి తొలిసారిగా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను పిల‌వ‌డం విశేషం.

ఈ క్ర‌మంలోనే  జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు, ఎంఎల్సీలు ర‌ఘువర్మ‌, సురేష్ లు హాజ‌ర‌య్యారు.క‌లెక్ట‌ర్ మాట్లాడుతుండ‌గానే ఎంఎల్సీ ర‌ఘువ‌ర్మ‌…ఓ బాధితురాలిని స్వ‌యంగా వేదిక‌పై ఉన్నఎస్పీ వ‌ద్ద‌కు తీసుకు వెళ్లి స‌మ‌స్య ప‌రిష్కారం చూడాల‌ని విన్న‌వించ‌గా…త‌ప్ప‌కుండా చూస్తాన‌ని చెప్ప‌డం విశేషం. చివ‌రిగా మృతి చెందిన జ‌వాన్ల‌కు మౌనం పాటించాల్సిన స‌మ‌యంలో నిర్దేశించిన స‌మ‌యం పూర్త‌యినా…అంద‌రూ ఇంకామౌనంగా ఉండ‌టంతో..ఏఆర్ అడ్మిన్ చిరంజీవి…డీసీఆర్బీ సీఐ వెంక‌ట‌రావుకు కాస్త సూచ‌న ఇవ్వ‌డంతో  మ‌రో నాలుగు నిమిషాలు పాటు పోలీసు అదికారులంతా మౌనం పాటించారు.ఏదైనా పోలీసులు అమ‌ర వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం..ఇద్ద‌రు లేడీ బాస్ ల ఆధ్వర్యంలో జ‌రిగింద‌నే అని  అంటోంది…స‌త్యం న్యూస్.నెట్.

Related posts

ఫ్యాక్షన్ పర్తిగా మారిన వనపర్తి: 9న బీసీల సభకు ఈటెల

Satyam NEWS

వాయిద్య కళాకారుల సంఘం ములుగు మండల కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

ఆన్లైన్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్న టిక్ టాక్

Satyam NEWS

Leave a Comment