28.7 C
Hyderabad
April 20, 2024 09: 57 AM
Slider నిజామాబాద్

నూతన విద్యావిధానంపై హర్షం వ్యక్తం చేసిన తపాస్ జుక్కల్

#TAPUSJukkal

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం 2020 గొప్పగా ఉందని దీన్ని స్వాగతిస్తున్నామని తపస్ బిచ్కుంద అధ్యక్షులు వై రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శేఖ్ ఖయ్యూమ్  తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ భావ దారిద్ర్యం గల విద్యా విధానాలతో 70  ఏళ్లలో జరిగిన విధ్వంసానికి జాతీయ నూతన విద్యా విధానం తో  చెల్లు అవుతుందని, కేంద్రప్రభుత్వం ఆమోదించిన ఈ విద్యావిధానం విద్యార్థులలో జాతీయ భావాలను, స్వీయ నైపుణ్యాలను  పెంచి భారత్ ను విశ్వగురువుగా తిరిగి నిలబెడుతుందన్నారు. ఈ నూతన విద్యా విధానానికి తపస్  జాతీయ స్థాయిలో  విలువైన సూచనలు చేసిందని  వారు తెలియజేశారు.

భారత  ప్రధాని నరేంద్ర మోడి , కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేశ్ నిశాంక్ ఫోఖ్రియాల్  లకు తపస్ తరపున ధన్యవాదాలు ప్రకటించి  బిచ్కుంద లో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ కామారెడ్డి జిల్లా  జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు యెన్నావార్ జనార్ధన్, యం విజయ్ కుమార్, హీరా , తపస్ జుక్కల్ శాఖ అధ్యక్షులు జై చంద్, తపస్ బిచ్కుంద సహ- కార్యదర్శి ఎమ్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు

Satyam NEWS

విద్యార్థుల జీవితాలు కలర్ ఫుల్ తో పాటు మీనింగ్ ఫుల్ గా ఉండాలి

Bhavani

తిరుప‌తి బ్ర‌హ్మోత్స‌వాల తరహాలో పైడితల్లి అమ్మ‌వారి జాత‌ర‌

Satyam NEWS

Leave a Comment