శ్రీశైల దేవస్థానం నూతన ఈవో గా డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైల క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పం తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. అధికారులు పూర్తి సహకారాలు అందించి క్షేత్ర అభివృద్ధి కి పాటుపడాలని కోరారు. సిబ్బంది అందరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని భక్తులతో మర్యాదగా మెలగాలని సూచించారు. జనవరి మాసంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను మార్చిలో ఉగాది మహోత్సవాలను నిర్వహించాల్సి ఉందన్నారు. ఉత్సవాల నిర్వహణకు ప్రణాళిక బద్ధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలెనని ఆయన అన్నారు
previous post