మద్యం షాపుల నడిపే సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం షాపులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులను నిర్వహించుకోవడానికి అనుమతించింది. అదే విధంగా ఇతర ప్రాంతాల్లో ఉండే మద్యం షాపులు 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించవచ్చని చెప్పింది. నూతన మద్యం విధానాన్ని ఎక్సైజ్ శాఖ నేడు ప్రకటించింది. ఈ విధానం 2019 నవంబర్ 1 నుంచి 2020 అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటుంది. ఈ నూతన మద్యం విధానంలో భాగంగా రాష్ట్రం మొత్తంలో 2, 216 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఫీజు ను భారీగా పెంచి షాకిచ్చింది నూతన మద్యం విధానం. లక్ష రూపాయలు ఉన్న దరఖాస్తు ఫీజును రెండు లక్షలకు పెంచేసింది ఎక్సైజ్ శాఖ. ఇది నాన్ రిఫండబుల్. గతంలో మాదిరిగానే లాటరీ విధానంలోనే మద్యం షాపులను ఎంపిక చేస్తారు. అయితే గతంలో ఉన్న నాలుగు స్లాబ్ లను 6 స్లాబు గా మార్చారు. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ దరఖాస్తు ఫీజును నిర్ణయించింది
previous post