36.2 C
Hyderabad
April 25, 2024 19: 09 PM
Slider జాతీయం

ఢిల్లీ ఎయిమ్స్ లో కొత్త ఫంగస్ వ్యాధి.. ఇద్దరి మరణం

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఫంగస్ కొత్త జాతిని గుర్తించారు. ఆస్పెర్‌గిల్లస్ లెంటులస్(Aspergillus lentulus) అనే ఈ ఫంగస్ దేశంలోనే తొలిసారిగా కనిపించడం ఎయిమ్స్(AIIMS) వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ ఫంగస్ మెడిసిన్ ప్రభావాన్ని పూర్తిగా తటస్థీకరిస్తుంది. దీంతో బాధపడుతున్న ఇద్దరు రోగులు మరణించారు.

క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ తో బాధపడుతున్న ఇద్దరు రోగులు ఆసుపత్రిలో చేరారు. దీంతో శరీరం లోపలికి వెళ్లే గాలి ప్రవాహం తగ్గిపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత, రోగి మరణించే అవకాశం గణనీయంగా పెరుగుతుంది.

Related posts

పోకర్న గ్రూప్ కరోనా విరాళం కోటి రూపాయలు

Satyam NEWS

టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ కారు విడుదల

Satyam NEWS

రేప్:8ఏళ్ళ బధిర బాలికపై 30 ఏళ్ల మృగాడి లైంగికదాడి

Satyam NEWS

Leave a Comment