30.7 C
Hyderabad
April 17, 2024 01: 57 AM
Slider కరీంనగర్

గృహలక్ష్మీ యల్పీజి నూతన కనెక్షన్ పథకం ప్రారంభం

#NewGasConnection

ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కరీంనగర్ యల్పీజి విక్రయ విభాగం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి సందర్భంగా “గృహలక్ష్మీ”  నూతన కనెక్షన్  పథకాన్ని ప్రారంభించినట్లు కరీంనగర్ సేల్స్ ఆఫీసర్ అలపాటి శాంతిస్వరూప్, హుజురాబాద్ అంబుజా గ్యాస్ అధినేత పి.వి.మదన్ మోహన్ తెలిపారు.

నవంబర్ 30వరకు కొనసాగే ఈ పథకంలో గ్యాస్ కనెక్షన్లు లేని వారికి అడగగానే గ్యాస్ కనెక్షన్లు ఏ జాప్యం లేకుండా డిపాజిట్,రీఫిల్ ధర చెల్లింపు పద్దతిన అందచేస్తారని వారు తెలిపారు. అదే విధంగా ఒకే సిలిండర్ కలిగిన గ్యాస్ వాడకందారులు రెండో సిలిండరును డిపాజిట్ చెల్లింపు పద్దతిన పొందవచ్చని  తెలిపారు.

గతంలో కేవలం రెగ్యులర్ కస్టమర్లకు మాత్రమే రెండో సిలిండర్ పొందే అవకాశం వుండేదని,అయితే దీన్ని దీపం,సియస్ఆర్ లబ్దిదారులకు విస్తరించడం జరిగింది కాబట్టి రెండో సిలిండర్ లేని వారందరూ ఈ అవకాశం వినియోగించకొని వంట గ్యాస్ సమస్య లేకుండా వుండొచ్చని‌ తెలిపారు.

ఆయిల్ కంపనీ ఓటిపి విధానాన్ని అమలులోకి తెచ్చిందని వంట గ్యాస్ రీఫిల్ కొరకు బుక్ చేసుకున్న వారికి నాలుగు అంకెల ఓటిపి వస్తుందని సిలిండర్ తీసుకునే సమయంలో డెలివరీ సిబ్బందికి కచ్చితంగా ఓటిపి తెలుపాలని ఓటిపి తమ ఫోన్లో నమోదు చేసుకుని డెలివరీ సిబ్బంది గ్యాస్ రీఫిల్ సిలిండర్ అందిస్తారని తెలిపారు.

కస్టమర్లు తాము రీఫిల్ సిలిండర్ పొందే సమయంలో పిడీసీ ముందస్తు తనిఖీకై డెలివరీ సిబ్బందిని కోరాలని శాంతిస్వరూప్,పి.వి.మదన్ మోహన్ కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు.

Related posts

ఎటెన్షన్: రైతన్నలూ రైస్ మిల్లర్స్ తో జాగ్రత్త

Satyam NEWS

హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగానే విజయనగరంలో కూడా…!

Satyam NEWS

నేస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్స్ పంపిణీ

Satyam NEWS

Leave a Comment