35.2 C
Hyderabad
April 20, 2024 15: 12 PM
Slider విజయనగరం

క‌రోనా క‌ట్ట‌డి: విజయనగరం జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం

#vijayanagarampolice

కరోనా సెకండ్ వేవ్ చుట్టుముడుతున్న వేళ దాని క‌ట్ట‌డికి అటు రెవిన్యూ,ఇటు పోలీస్ యంత్రాంగం చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు 18 గంట‌ల పాటు క‌ర్ఫ్యూ అమ‌లు జ‌రుగుతున్నా…పైకి లెక్క‌లు తెలియ‌కుండా చాలా మంది హోం ఐసోలేష‌న్ లోనే ఉండిపోతున్నారు.మ‌రి కొందరు హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతున్నారు.

ఈ  నేప‌ద్యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ ఓ ముంద‌డుగు వేసింది. ఇప్ప‌టికే చెక్ పోస్టులు  ప్ర‌ధాన ర‌హ‌దారుల‌ను బంధించిన పోలీస్ శాఖ‌…అద‌నంగా స‌మీప పోలీస్ స్టేష‌న్ల  నుంచీ సిబ్బందిని బందోబ‌స్తుకు దించింది.ఇందులో భాగంగా గుర్లు, నెల్లిమ‌ర్ల‌,గంట్యాడ‌, విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ వంటి స్టేష‌న్ల నుంచీ ఎస్ఐలు దామోద‌ర్ ,లీలావ‌తి,నారాయ‌ణ‌లు న‌గ‌రంలో ప్ర‌ధాన జంక్ష‌న్ల వ‌ద్ద వాహ‌న‌దారుల‌ను క‌రోనా క‌ట్ట‌డి ప‌ట్ల అలెర్ట్ చేయిస్తున్నారు.

ఇందులో భాగంగా న‌గరంలోని మ‌యూరీ జంక్ష‌న్ స‌మీపంలో ఎత్తు బ్రిడ్రి వ‌ద్ద గుర్ల ఎస్ఐ లీలావ‌తి త‌న సిబ్బందితో పాటు  జంగిల్ యూనీఫాం ద‌రించిన ఎస్టీఎఫ్ సిబ్బందితో క‌రోనా క‌ట్ట‌డికి క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో  అంటే 12 దాటితే రోడ్ల మీద ఎవ్వ‌రు ఉన్నా..అక్క‌డే మండు టెండ‌లో ఉంచేస్తామ‌ని ఎస్ఐ  లీలావాతి హెచ్చరించారు.

మ‌రోవైపు న‌గ‌రంలోని గంట‌స్తంభం వ‌ద్ద ట్రాఫిక్ ఎస్ఐ  హ‌రిబాబు, మ‌రో ట్రాఫిక్ ఎస్ఐ భాస్క‌ర రావులు  రోడ్ల మీద ఉండి..క‌ర్ఫ్యూ, దాంతో పాటు లాక్ డౌన్ నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను ప్ర‌జ‌లంతా  పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాలను ఓ సారి చూడండి…!

క‌ర్ఫ్యూ ఫ‌లిత‌మో లేక‌,ప్ర‌జ‌ల‌లోమార్పో ఏమో గాని ఇంతవ‌ర‌కు ఫోర్ డిజిట్స్ ల‌లో న‌మోదు అయ్యే కరోనా కేసులు కాస్త మూడు అంకెల సంఖ్య‌కు చేరింది. దీంతో కాస్త పర్వాలేద‌ని అనిపిస్తున్నా ఆ సంఖ్య త‌గ్గుముఖం పట్ట‌డంలో రెవిన్యూ యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చేప‌డుతున్న చ‌ర్య‌లు గురించి చెప్ప‌త‌ప్ప‌దు.

గ‌త కొద్ది రోజుల నుంచీ ఎస్పీ రాజ‌కుమారీ ఆదేశాలతో అటు ఏఎస్పీ స‌త్యానారాయ‌ణ‌రావు,ఇటు ఓఎస్డీ సూర్య‌నారాయ‌ణ‌రావులు త‌మ‌, త‌మ సిబ్బంది తో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పోస్టులు, జంక్ష‌న్ల వ‌ద్ద త‌మ‌,త‌మ సిబ్బందిని చేస్తున్న చేప‌డుతున్న విధుల‌ను ప‌ర్య‌వేక్షిస్తునే ఉన్నారు. ఈ క్ర‌మంలో మూడు డివిజ‌న్ల కు సంబంధించి ముగ్గురు డీఎస్పీల స‌మ‌క్షంలో సంబంధిత సిబ్బందితో క‌ర్ఫ్యూ చ‌ర్య‌లు ప‌క‌డ్బందీగా అమ‌లయ్యేలా చూస్తున్నారు.

ఈ మేర‌కు జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల పరిధిలో రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో  పోలీసు అధికారులు, సిబ్బంది  విధులు నిర్వహించారు.క‌రోనా నిబంధనలు పాటించాలని ప్ర‌జ‌లంద‌రికీ విజ్ఙ‌ప్తులు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యును అమలుచేస్తూ, షాపులు మూయించి, అనధికారంగా బయట తిరుగుతున్న‌వారిని హెచ్చ‌రిస్తున్నారు.క‌రోనా  నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా డబుల్ మాస్క్ ధరించాలని పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు విజ్జ్ఞప్తి చేశారు.

Related posts

గోవిందో గోవిందా: అయ్యో గాజు బాటిళ్ల ప్లాన్ పగిలిపోయిందే!

Satyam NEWS

తెలంగాణ చరిత్రలో కలకాలం నిలిచిపోయే ప్రొపెసర్‌ జయశంకర్‌

Satyam NEWS

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

Satyam NEWS

Leave a Comment