24.7 C
Hyderabad
March 29, 2024 06: 00 AM
Slider రంగారెడ్డి

కొత్త ఆవిష్కరణలు విద్యార్ధి దశ నుంచే మొదలు కావాలి

#cbit

కొత్త ఆవిష్కరణలు చేసేందుకు కావాల్సిన ఆలోచనలు విద్యార్థి దశ నుంచే మొదలు అవుతాయని ప్రొఫెసర్ యూ కె చౌదరి అన్నారు. నేడు  కోకాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  సి బి ఐ టి కళాశాల ఆచార్యులు  9 మరియు 10 తరగతులకు చెందిన విద్యార్థులకు  నూతన ఆవిష్కరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో  డైరెక్టర్  ఐ అండ్ ఐ  ప్రొఫెసర్ యూ కె  చౌదరి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు  ఒక కొత్త ఒరవడి ని సృష్టిస్తాయని తెలిపారు.

నేడు  ప్రపంచంలో, అనేక  దేశాలు సంక్షోభం లో వున్నాయని, అందువల్ల కొత్త, బలమైన, మరింత సమగ్రమైన, స్థిరమైన మార్గాల కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తున్నారని ఆయన అన్నారు. మన దేశంలో కొత్త  ఆవిష్కరణలను ప్రోత్సహించే విధానాలు గతంలో కంటే చాలా బాగా  ఉన్నాయి. 

కొత్త ఆవిష్కరణలు కావలిసిన ఆలోచనలు విద్యార్థి దశ నుంచే మొదలు అవుతాయని ఆయన అన్నారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం సహాయ ప్రొఫెసర్ డాక్టర్ బి వి ఎస్  రావు మాట్లాడుతూ   ప్రస్తుత కాలంలో ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ఆవిష్కరణ ఆవశ్యకతను, దాని ప్రాముఖ్యత గురించి  చెప్పారు. నూతన ఆలోచనలను రూపొందించడంలో ఉన్న కాన్సెప్ట్‌ను వారికి అర్థం చేసుకోవడానికి సరళమైన ఉదాహరణలు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

ది. 08.08.2023 పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం

Bhavani

ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

Satyam NEWS

కృష్ణా నదిపై హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment