ఇంతకన్నా దురదృష్టకరమైన సంఘటన ఇంకొకటి ఉండదు. నిజంగా ఇది దురదృష్టకరమైన సంఘటనే. మొదటి పోస్టింగ్‌ని స్వీకరించేందుకు వెళుతున్న 26 ఏళ్ల ఐపీఎస్ అధికారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అంటే అంతకన్నా దురదృష్టకరమైనది మరొకటి ఉంటుందా? మధ్యప్రదేశ్‌కు చెందిన హర్షవర్ధన్ కర్ణాటక కేడర్‌కు ఎంపిక అయిన 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అతను తొలి పోస్టింగ్ అందుకోవడానికి వెళుతున్న సమయంలో కర్ణాటక లోని హసన్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం హాసన్ తాలూకాలోని కిట్టనే గ్రామ సమీపంలో అతను ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైరు పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఇల్లు ఆ తర్వాత చెట్టును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో హర్షవర్ధన్ అక్కడికక్కడే మరణించాడు.