26.7 C
Hyderabad
May 1, 2025 06: 12 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

ఠారెత్తిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం

traffic chalan

చట్టాన్ని సవరించేది లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తేల్చి చెప్పడంతో వివిధ రాష్ట్రాలు ఈ కొత్త మోటారు వెహికల్ చట్టాన్ని అమలు చేయాలా లేదా అనే సంశయంలో పడిపోయాయి. ఇప్పటికే ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరాఖండిగా చెప్పేశారు. చాలా రాష్ట్రాలలో ఈ నూతన వాహన చట్టంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. సెప్టెంబరు 1 దేశంవ్యాప్తంగా నుంచి నూతన వాహన చట్టం అమల్లోకి వచ్చచింది. కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు పెద్ద మొత్తంలో చలాన్లు పడుతున్నాయి. వేలకు వేలు ఫైన్‌లు పడుతుండడంతో కొందరైతే వాహనాలను పోలీసుల దగ్గరే వదిలివేసి వెళ్తున్నారు. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుందని కేంద్రం తీరుపై మండిపడుతున్నారు వాహనదారులు. వేలకు వేలు ఫైన్‌లు విధిస్తుండడతో రోడ్లపైకి వాహనాలను తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. వాహనాల ధరకు మించి జరిమానాలను విధిస్తున్నారు. మొన్నటి వరకు వేలల్లోనే చూశాం. కానీ ఇప్పుడు ఏకంగా లక్షల్లోనూ ఫైన్‌లు పడుతున్నాయి. రోజుకో రికార్డ్ బద్ధలవుతూ దేశంలో హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఓ లారీ డ్రైవర్‌కు ఏకంగా రూ.2,00,500 జరిమానా విధించారు. ఢిల్లీలోని ముకర్బా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన జరిమానాల రికార్డులను ఈ చలాన్ తిరగ రాసింది. ఓవర్‌ లోడ్‌ కారణంగా లారీ డ్రైవర్‌ రూ.2 లక్షల 500 రూపాయాలను జరిమానా విధించారు. అంతేకాదు డ్రైవర్ రామ్ కిషన్ అరెస్ట్ చేశారు. నూతన వాహన చట్టం ప్రకారం లారీలో పరిమితికి మించి లోడ్ ఉంటే రూ.20వేలు జరిమానా విధిస్తారు. నిర్దేశించిన లోడ్‌కు మించి తీసుకెళ్తున్న ప్రతి టన్నుకు అదనంగా రూ.2వేల ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే పరిమితికి మించి ఎంత ఎక్కువ లోడ్ ఉంటే అంత భారీగా జరిమానా పడుతుందన్న మాట..!

Related posts

రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి సీఎంగా అనర్హుడు

Satyam NEWS

విలేకరులకు ప్లాట్లు ఇవ్వాలి:బిజెపి

Satyam NEWS

ఎస్సీ సబ్ ప్లాన్ అమలు గడువును పొడిగించాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!