32.7 C
Hyderabad
March 29, 2024 11: 33 AM
Slider సినిమా

ఆహా యాప్ లో విడుదల అయిన నవీన్ చిత్రం

#Talasani Srinivasa Yadav

కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ ద్వారా మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, చిత్ర దర్శకుడు శ్రీకాంత్ నాగోతి, నిర్మాత యశ్వంత్, హీరో నవీన్ చంద్ర, శరత్ మరార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ షూటింగ్ లు పూర్తి చేసుకున్న చిత్రాలు ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేసేందుకు అనుకూలంగా లేవని అన్నారు.

భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ లో విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను మంత్రి అభినందించారు. సినిమా సక్సెస్   కావాలని, యూనిట్ సభ్యులు అందరికీ మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.

Related posts

తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్స్ నిరసన

Satyam NEWS

కొవిడ్‌ బాధిత అట‌వీ ఉద్యోగుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటాం

Satyam NEWS

విజయభేరిలో ఖమ్మం సత్తా చాటుదాo

Bhavani

Leave a Comment