ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేతలు ప్రమొద్, నాగరాజులు ప్రోడక్షన్ నేం 1 పేరిట కళ్యాణ మండపం చిత్రం నిర్మాణం చేపట్టారు. కడప జిల్లా రాయచోటిలో ఈ చిత్ర ముహూర్తం సన్నివేశానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ లు. ఆర్ యక్స్ 100, ద్రోణ369, మన్మథుడు 2 సినిమాలకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడిగా శ్రీధర్, కెమెరామెన్ దానియల్ విశ్వాస్ లు ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా వైయస్సార్ సిపి నాయకులు శ్రీకాంత్ రెడ్డి నవాజ్ లు మాట్లాడుతూ రాయలసీమ నుంచి పద్మనాభం, వై విజయ లాంటి కళాకారులు రాయలసీమ ఖ్యాతిని చాటారన్నారు నాయకులు. రాయచోటి నుంచి పలువురు నిర్మాతలుగా, హీరోలుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఆనందంగా వుందన్నారు.
శంకరాభరణం సినిమా తో ప్రజల మనసులో నటి తులసి చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. సినిమా ద్వారా వినోదాన్ని అందించడంతో పాటు ఎంతో మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. సినిమా ద్వారా ఇచ్చే సందేశంతో సమాజంలో మార్పు కూడా సాధ్యమవుతుందన్నారు.
సినిమా నిర్మాణానికి సంబంధించి పూర్తి సహయ సహకారాలు అందిస్తామన్నారు. చిత్ర బృందం మాట్లాడుతూ ఈనెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని, రాయచోటి పరిసర ప్రాంతాల్లో 40%శాతం షూటింగ్ వుంటుందని సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేసుకోని జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. హీరో హీరోయిన్లుగా కిరణ్ (రాజవారు రాణివారు ఫేం) ప్రియాంక జవల్కార్(ట్యాక్సివాలా ఫేం) ముఖ్యపాత్రల్లో సాయికుమార్, తనికెళ్ల భరణి, తులసీ లు నటిస్తున్నారు.