విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందిస్తుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కొత్త ఆఫీసు మంగళవారం ప్రారంభించారు. ఇన్నాళ్లూ పాస్ పోర్ట్ ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి పంపిస్తున్నారు. ఇకపై విజయవాడ లోనూ ముద్రించనున్నారు. దీంతో పాస్ పోర్ట్ జారీ సమయం గణనీయంగా తగ్గనుంది. తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు.
previous post
next post