24.7 C
Hyderabad
March 26, 2025 09: 10 AM
Slider ప్రత్యేకం

సొంత పార్టీ పెట్టబోతున్న పీ వీ సునీల్ కుమార్

#pvsunilkumar

ఐపీఎస్ అధికారి, జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సర్వాధికారాలు చెలాయించిన పీ వీ సునీల్ కుమార్ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్న పీ వీ సునీల్ కుమార్ తన రాజకీయ ప్రవేశం కోసం మొదట్లో వైసీపీని ఎంచుకున్నారు. వైసీపీలో జగన్ రెడ్డి ప్రాపకం కోసం ఆయన చెప్పిన ఎన్నో పనులను పూర్తి చేశారు. బాపట్ల పార్లమెంటు స్థానాన్ని ఆయన ఆశించారు. అయితే చివరలో ఆయనకు జగన్ రెడ్డి హ్యాండిచ్చారు. పీ వీ సునీల్ కుమార్ కు రిక్తహస్తం చూపించడంతో ఆయన అప్పటిలో ఆగ్రహించారు. అయితే ఏమీ చేయలేకపోయారు.

ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో పీ వీ సునీల్ కుమార్ సైలెంట్ అయ్యారు. అయితే ఒక ప్రయివేటు ఆర్మీ లాంటి యువకుల బ్యాచ్ ని మాత్రం పెంచి పోషిస్తూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఆయనపై మాజీ ఎంపి, ప్రస్తుత ఉప సభాపతి కనుమారి రఘురామకృష్ణంరాజు ను లాకప్ లో చిత్రహింసలు పెట్టిన కేసు నమోదు చేసింది. ఇంత వరకూ పోస్టింగ్ ఇవ్వలేదు కూడా. అయితే పీవీ సునీల్ ను ఎందుకు సస్పెండ్ చేయడం లేదు అని రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఆయనను సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు.

పదే పదే ఈ అంశాన్ని రఘురామ తన అసంతృప్తి స్వరంగా వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు కానీ.. సస్పెండ్ చేయడం లాంటివి ఇంకా చేయలేదు. రఘురామ కేవలం ప్రతీకార ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కానీ ప్రభుత్వం సునీల్ కుమార్ అన్ని వ్యవహారాలపై దృష్టి పెట్టి తదుపరి అడుగులు వేస్తోంది. రఘురామ నియోజకవర్గంలో ఓ చెరువు కట్టను ఆక్రమించుకున్న వారి ఇళ్లను కోర్టు ఆదేశాలతో తొలగిస్తున్న సమయంలో కొంత మంది బయట వ్యక్తులు వచ్చి గొడవ చేశారు.

వారు వచ్చిన కారుపై అంబేద్కర్ ఇండియా మిషన్ అనే పేరు ఉంది. పీవీ సునీల్ బొమ్మ కూడా ఉంది. వారు ఉద్దేశపూర్వకంగా వచ్చి విద్వేషాలు రగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు కేసులు పెట్టారు. అంబేద్కర్ ఇండియా మిషన్ ను పీవీ సునీల్ పెట్టి మత మార్పిళ్లు చేస్తున్నారన్న ఆరోపణలను గతంలో రఘురామ చేశారు . కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. పీవీ సునీల్ కుమార్ కు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయి. జగన్ సీటు ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ ఎందుకో ఇవ్వలేదు.

రిటైరైనా తర్వాత పార్టీలో చేరితే ఇస్తారని అనుకున్నారేమో. అయితే ఇప్పుడు ఆయన సొంత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. సొంత రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందన్న సంకేతాలు పంపుతున్నారు. త్వరలో పీవీ సునీల్ వీఆర్ఎస్ కు అప్లయ్ చేస్తారని.. సొంత పార్టీ పెడతారని అంటున్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమ పంథాను ఎంచుకుంటారని అంటున్నారు. ఇందు కోసం పోస్టింగ్ లేని ఆయన బ్యాకప్ సమావేశాలు పెట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు

Related posts

నకిలీ డాక్టర్ ఆటకట్టించిన పోలీసులు

mamatha

నవయుగ బాబు లకు టెండర్ రద్దు

Satyam NEWS

ఇతర దేశాల విమానాలు ఆగేందుకు యుఏఈ సుముఖత

Satyam NEWS

Leave a Comment