Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో వైఎస్ఆర్ నవోదయం పథకం ప్రారంభం

ap-cm-ys-jagan-mohan-reddy

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన రుణాలను ఒకే విడతలో రీస్ట్రక్చర్ చేసేందుకు వీలుగా వైఎస్ఆర్ నవోదయం పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 2020 మార్చి 31 తేదీ వరకూ ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రుణాలు రీషెడ్యూలు చేసేందుకు ఈ కార్యాచరణ రూపొందించారు. ఈమేరకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని పరిశ్రమల శాఖ తెలిపింది. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు రుణ ఒత్తిడిలో ఉన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలను ఆ ఇబ్బందుల నుంచి తప్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 9 నెలల కాలంలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన రుణాలు రీషెడ్యూలు చేసేలా సదరు బ్యాంకులకు ప్రభుత్వం హామీలు జారీ చేయనుంది. ఒన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ పేరిట ఈ కార్యాచరణ చేపట్టనున్నారు. 2020 మార్చి 31 లోగా ఎంఎస్ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రుణాలు 2019 జనవరి 1 తేదీ నాటికి 25 కోట్ల రూపాయలకు మించి ఉండకూడదని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. రుణాల రీస్ట్రక్చర్ చేసే తేదీ నాటికి సదరు ఎంఎస్ఎంఈ పరిశ్రమ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని పేర్కొంది. జిల్లాల వారీగా రుణ ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ నియమించిన ప్రభుత్వం.. దీని కోసం రూ. 10 కోట్లను కేటాయించింది. రూ. 25కోట్ల వరకూ బకాయిపడిన సూక్ష్మ చిన్నమధ్య తరహా పరిశ్రమలనే రుణాల రీషెడ్యూలుకు పరిగణనలోకి తీసుకుంటారు. రుణాల రీస్ట్రక్చర్ కోసం ఎంఎస్ఎంఈలు 2020 మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related posts

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాలి

Satyam NEWS

అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ కు డాక్టర్ డి.కె సిన్హా

Satyam NEWS

కంప్లయింట్: ప్రజా ఫిర్యాదులను వారంలో పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment