39.2 C
Hyderabad
March 29, 2024 16: 21 PM
Slider సంపాదకీయం

చరిత్రలో తొలి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘనత ఏమిటంటే…

#YSJaganmohanReddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అరుదైన రికార్డు సాధించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బహిష్కరించిన సంఘటన ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అలాంటి అరుదైన రికార్డును ఆంధ్రప్రదేశ్ లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించింది.

కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సూచనల ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అఖిల పక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కనుగొని రాష్ట్ర హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ భావించారు.

అందుకోసం నేడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నామని ఇది తమ పార్టీ ప్రజాదరణకు గుర్తు అని గతంలో ఇదే ఎన్నికల కమిషనర్ సారధ్యంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చెప్పిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే ఎన్నికల కమిషనర్ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరించడం గమనార్హం. అప్పటిలో ఏకగ్రీవ ఎన్నికల ప్రకటన చేసిన డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ఆ తర్వాత ఎన్నికల వాయిదా ప్రకటన చేశారు.

ఎన్నికలను వాయిదా వేయగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ రమేష్ కుమార్ పై పలు రకాల ఆరోపణలు చేసింది. ఆయనను పదవీచ్యుతుడిని చేసింది కూడా. అయితే రాష్ట్ర హైకోర్టు ఆదేశాల కారణంగా ఆయనను తిరిగి నియమించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆయన పదవీ కాలం ముగిసే వరకూ ఎన్నికలు జరపకుండా ఉండేందుకు అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. మళ్లీ హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అఖిల పక్ష సమావేశంలో ఏ పార్టీ అభిప్రాయం వారు చెప్పవచ్చు కానీ సమావేశాన్ని అధికార పక్షం బహిష్కరించడం కొత్తగా ఉంది.

 అఖిల పక్ష సమావేశంలో ఏ పార్టీ ఏ అభిప్రాయం చెబుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అయితే అన్ని పార్టీలూ అభిప్రాయం చెబితే ఎన్నికల సంఘం రాష్ట్ర హైకోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు వీలు కలుగుతుంది. అయితే అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని పార్టీలు చెబితే 151 స్థానాలు ఉన్న మేం వినాలా అని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నది.

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలు వింటుంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి రాయాల్సిన అవసరం ఉన్నట్లుగా అనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Related posts

ఓపెన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

ములుగు ఎస్పీని కలిసిన ప్రమోషన్ పొందిన ఏఎస్ఐలు

Satyam NEWS

జగన్ రెడ్డి ఇక కాస్కో పులి పంజా వాడి చూపిస్తాం

Satyam NEWS

Leave a Comment