22.2 C
Hyderabad
December 10, 2024 10: 20 AM
Slider జాతీయం

బ్యాంకింగ్ రంగంలో కొత్త నిబంధనలు

#reservebankofIndia

డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్‌ కు సంబంధించిన అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నది. వివిధ బ్యాంకింగ్, ఆర్ధిక సంస్థలు చట్టాలకు మరింత కచ్చితంగా కట్టుబడి ఉండేలా నిబంధనలు అమలు చేయబోతున్నారు. దేశీయ నగదు బదిలీల భద్రతను పెంచేలా ఆర్బీఐ ఈ రూల్స్‌ను రూపొందించింది.

24 జూలై 2024న విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం మరిన్ని బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లు పెరుగుతాయి. మనీ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన చెల్లింపు వ్యవస్థలు మరింత మెరుగవుతాయి. కేవైసీ అవసరాలను మరింత సులభతరం చేయనుంది. ఈ కొత్త నిబంధనలపై ఆర్బీఐ ఇటీవలే సమీక్ష నిర్వహించింది. నవంబర్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ కార్డ్ తన వినియోగదారులపై ప్రభావం చూపేలా యుటిలిటీ బిల్లు చెల్లింపులు, ఫైనాన్స్ ఛార్జీల విషయంలో మార్పులు అమలు చేయబోతోంది.

అన్‌సెక్యూర్డ్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై ఫైనాన్స్ ఛార్జీలు నెలకు 3.75 శాతానికి పెరుగుతాయి. ఇక బిల్లింగ్ పిరియడ్‌లో యుటిలిటీ చెల్లింపుల మొత్తం రూ.50,000 మించితే అదనంగా 1 శాతం ఛార్జి విధించనుంది. అయితే 1 శాతం అదనపు ఛార్జి వసూలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ తన ఫీజు విధానం, క్రెడిట్ కార్డ్ రివార్డ్ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు బీమా, కిరాణా కొనుగోళ్లు, విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపులు, ఆలస్య చెల్లింపు రుసుము వంటి సేవలను ప్రభావితం చేస్తాయి.

నవంబర్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. స్పా బెనిఫిట్స్ నిలిపివేత, రూ.1,00,000 కంటే ఎక్కువ ఖర్చులకు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు తొలగింపు, ప్రభుత్వ లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లు తొలగింపుతో పాటు థర్డ్ పార్టీ మార్గాల ద్వారా విద్యా ఫీజులు చెల్లింపుపై 1 శాతం ఛార్జీలు విధింపు వంటి మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ నవంబర్ 30, 2024గా ఉంది.

ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్ సూపర్ 300 డేస్’ ప్రత్యేక ఎఫ్‌డీలో జనరల్ పబ్లిక్‌కు కూడా 7.05 శాతం వడ్డీ అందించనుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం వడ్డీ అందించనున్నట్టు పేర్కొంది. ఇక 400 రోజుల ఎఫ్‌డీపై జనరల్ పబ్లిక్‌కు 7.25 శాం, సీనియర్‌ సిటిజన్‌లకు 7.75 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 8 శాతం వడ్డీ రేట్లను అందించనుంది.

Related posts

నేడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం

Satyam NEWS

కందుకూరు మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ

Satyam NEWS

ఆన్ లైన్ లో విద్యార్ధుల్ని హెడ్ మాస్టర్ లే పర్యవేక్షించాలి

Satyam NEWS

Leave a Comment