40.2 C
Hyderabad
April 19, 2024 17: 27 PM
Slider ఆంధ్రప్రదేశ్

కొత్త ఇసుక పాలసీ సిద్ధం: మాఫియాపై కొరడా

Perni-Nani

ఏపి ఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖ లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. సుదీర్ఘంగా జరిగిన ఏపి మంత్రి వర్గ సమావేశం అనంతరం సమాచార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు అవుతుంది. ఈ ప్రక్రియను మూడు మాసాల్లో పూర్తిచేయాలని రవాణాశాఖ, ఆర్థికశాఖ, న్యాయశాఖ, సాధారణపరిపాలన శాఖలకు సీఎం ఆదేశం జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలూ, నియమ నిబంధనలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లానే  ఆర్టీసీ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకి పెంచుతారు. బస్సు ఛార్జీలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బస్సు ఛార్జీల నియంత్రణ కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విలీనం ద్వారా 3300 కోట్ల ఆర్థిక బాధ్యతను ప్రభుత్వం చేపట్టనున్నది. అదే విధంగా పర్యావరణం దెబ్బతినకుండా గతంలో ఉన్న ఇసుక మాఫియాను అరికట్టేలా కొత్త మైనింగ్‌ పాలసీ కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చట్ట పద్ధతిలో నేరుగా వినియోగదారుకు మాఫియాతో సంబంధం లేకుండా ఇసుక చేరేవిధంగా పాలసీని రూపొందించారు. 13 జిల్లాల్లో 41  స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. అక్టోబర్ నాటిని వీటిని 70 నుంచి 80 వరకూ పెంచుతారు. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్‌ పాయింట్‌ వద్ద టన్ను ఇసుక  ధర రూ.375లుగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నుంచి రవాణా ఖర్చు అదనంగా వసూలు చేస్తారు. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90లు రవాణా ఖర్చుగా నిర్ణయించారు. సొంతంగా ప్యాసింజర్‌ ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునేవారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 మార్చి నెలాఖరు వరకూ 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్టు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్నవి 3.97 లక్షలు ఉన్నట్టు అంచనా. ఏడాదికి రూ. 397. 93 కోట్లు  వారికి సహాయం చేయనున్న ప్రభుత్వం. ఇంకా పెరిగినా భరించడానికి ప్రభుత్వం సిద్ధం. వైయస్సార్‌ పెళ్లికానుక అమలుకు మంత్రివర్గం నిర్ణయించింది. అదే విధంగా ఆశావర్కర్ల  జీతాల పెంపునకు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదాకోసం పోరాటంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తూ మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నది. మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం. పనులు ప్రారంభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్ని మంత్రివర్గం. భూముల లీజు కూడా చెల్లించలేదని కేబినెట్‌కు తెలిపిన పరిశ్రమల శాఖ

Related posts

కరోనా రోగులకు ఆహారం అందచేసిన మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

రోటరీ క్లబ్ కైలాస భూమికి లక్ష విరాళం…!

Satyam NEWS

దుబ్బాక కోసం బీజేపీ డబ్బు డ్రామాలు బయట్టబయలు

Satyam NEWS

Leave a Comment