30.2 C
Hyderabad
September 14, 2024 15: 33 PM
Slider సినిమా

వితిక చేతిలో చనిపోయిన వరుణ్

big boss 2

బిగ్ బాస్ హౌస్ లో మొన్నటి ఆదివారం ఎలిమినేషన్స్ ఎఫెక్ట్ కొంచం తగ్గినట్లే అనిపిస్తుంది. ఇక నిన్న సోమవారం హౌస్ లో ఎలిమినేషన్ కోసం నామినేట్ జరిగింది. ఇందులో రవికృష్ణ కెప్టెన్ బాబా భాస్కర్ వలన సేవ్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్ విషయంలో మహేష్, హిమజ, శ్రీముఖి, పునర్నవి, శిల్ప ఈ ఐదుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త టాస్క్ జరిగింది. గత సీజన్ లో కూడా దెయ్యంకి సంబంధించిన టాస్క్ ఒకటి జరిగింది. సేమ్ టు సేమ్ అలాగే ఈ టాస్క్ పెట్టారు. ఇందులో వితికకి దెయ్యం అనే టాగ్ ఇచ్చారు. ఈ టాస్క్ లో వితిక హౌస్ లో కొందరిని హత్య చేయవలసి ఉంటుంది. అంటే బిగ్ బాస్ ఒక్కో హౌస్ మేట్ గురించి వితికకి ఒక టాస్క్ ఇస్తాడు. అది వితిక పూర్తి చేస్తే ఆ హౌస్ మేట్ చనిపోయినట్లు లెక్క. అలా చనిపోయిన వాళ్ళు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్మశానంలో పడుకోవాల్సి ఉంటుంది. అయితే వితిక ఎలాంటి పనులు చేస్తే ఎవరు చనిపోతారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఈ టాస్క్ చాలా ఆసక్తిగా కొనసాగే అవకాశం ఉంది. నిన్ననే బిగ్ బాస్ కూడా హౌస్ మేట్స్ టాస్క్ ల విషయంలో గట్టిగా ఉండాలి. ఫైనల్ లెవెల్ స్టార్ట్ అయ్యిందని చెప్పాడు. ఆ లెక్కన చూస్తే ఇక నుండి హౌస్ లో మంచి టాస్క్ లు వుండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Related posts

Corona effect: శ్రీకాకుళంలో 6 గంటల వరకే దుకాణాలు

Satyam NEWS

ప్రీతి మృతికి కారకులైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి

Murali Krishna

వెరైటీ: నెల్లూరు నగరంలో రౌడీ మేలా

Satyam NEWS

Leave a Comment