27.7 C
Hyderabad
April 26, 2024 04: 13 AM
Slider రంగారెడ్డి

ముగిసిన  రెండు రోజుల నూతన  అధ్యాపకుల శిక్షణ కార్యక్రమం

#trainingcamp

సిబిఐటి లో కొత్తగా చేరిన అధ్యాపకుల  రెండు రోజుల  శిక్షణ కార్యక్రమం నేడు ముగిసింది. ఈ కార్యక్రమం లో  భాగం గా పరీక్ష నిర్వహణ గురించి  డైరెక్టర్ – ఎఈసి, సిఒఈ  ప్రొఫెసర్ సురేష్ పబ్బోజు  క్లాస్  పరీక్షలు, సెమిస్టర్ ముగింపు పరీక్షలు గురించి, ఉపాధ్యాయ ప్రొఫైల్ గురించి  ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి చెప్పారు.  హెడ్ – సిఎస్‌ఇ మరియు జాయింట్ డైరెక్టర్ – అకడమిక్ (ఇన్ఫర్మేటిక్స్) ప్రొఫెసర్ ఎమ్ స్వామి దాస్ బోధనా అభ్యాస ప్రక్రియలలో ఐసిటిని అమలు చేయటం గురించి వివరించారు.

విద్యార్థి పురోగతి సలహాదారులు  పి శ్రీనివాస శర్మ  విద్యార్థులకు కావసిన మార్గదర్శకత్వం వివరించారు. మానవ వనరుల విభాగాధిపతి అన్నే వైలెట్ మానవ వనరుల విధి విధానాలు వివరించారు.  లైబ్రేరియన్ డాక్టర్ సి శ్రీకాంత్ రెడ్డి  బోధన అభ్యాస పద్ధతులు మరియు పరిశోధనలో లైబ్రరీ వనరులు వివరించారు.  కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు, ఫ్యాకల్టీ ప్రమేయంపై అడ్వైజర్- సిడిసి డాక్టర్ ఎన్ ఎల్ ఎన్ రెడ్డి  చెప్పారు. ఈ కార్యక్రమానికి  కన్వీనర్ గా  అసోసియేట్ డైరెక్టర్ – ఐక్యూఎసి ప్రొఫెసర్ ఆర్ మదన మోహన  డైరెక్టర్- ఐక్యూఎసి ప్రొఫెసర్ ఎన్ వి కోటేశ్వరరావు వున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.

Related posts

బీజేపీ బలపడుతుందనే టీఆర్ఎస్ నాయకుల దాడి

Satyam NEWS

దళిత బంధు తరహాలో ఆదివాసులకు సాయం చేయాలి

Satyam NEWS

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

Satyam NEWS

Leave a Comment