31.2 C
Hyderabad
April 19, 2024 03: 49 AM
Slider నల్గొండ

రైతులు వ్యవసాయంలో నూతన పద్దతులు అవలంబించాలి

#MLASaidiReddy1

రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట పొలాలలో ఎరువులు వాడాలని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  అన్నారు.

బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల వ్యవసాయ కార్యాలయంలో వరి పంటలో వచ్చే తెగులు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాలలో ఎక్కువ మోతాదులలో యూరియా, మందులు పిచ్చికారి చేయడం వలన పంటల దిగుబడి తగ్గిపోయి భూసారం దెబ్బతింటుందని ఆయన అన్నారు.

సాధ్యమైనంత వరకు రైతులు సంబంధిత  వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంట దిగుబడి వచ్చే  మందులు పిచ్చికారి చేయాలని, సేంద్రీయ ఎరువులు వాడాలని సూచించారు.

ఈ కార్యక్త్రమంలో జెడ్‌పి‌టి‌సి జగన్ నాయక్, ఎం‌పి‌పి ముడావత్ పార్వతి కొండానాయక్, మఠంపల్లి సర్పంచ్ మన్నెం శ్రీనివాస రెడ్డి, గుండా బ్రహ్మారెడ్డి , వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related posts

నిర్మల్ లో సివిల్ సర్వీసెస్ పై అవగాహన సదస్సు

Satyam NEWS

విశాఖపట్నం కలెక్టర్ కు సిఎం జగన్ ప్రశంస

Satyam NEWS

ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా సెంచరీ కి దగ్గరలో పెండింగ్ చలానాలు

Satyam NEWS

Leave a Comment