30.2 C
Hyderabad
February 9, 2025 21: 05 PM
Slider విశాఖపట్నం

విశాఖ హాని ట్రాప్ కేసుల్లో కొనసాగుతున్న ట్విస్టులు

#honeytrap

విశాఖ హాని ట్రాప్ కేసుల్లో ట్విస్టులు కొనసాగుతున్నాయి. జాయ్ జమిమా కేసులో కొత్త బాగోతం బయట పడుతున్నది. ఎన్ఆర్ఐ బాధిత తల్లి విజేఎఫ్ లో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. తమ బిజినెస్ ప్రోమోట్ చేస్తానని హనీట్రాప్ నిందితురాలు తమ దగ్గరకు వచ్చిందని ఆమె తెలిపారు. దానితో తమ కుమారుడి తో పరిచయం పెంచుకుందని తెలిపారు. తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా అమెరికా నుండి తమ కుమారుడిని వైజాగ్ కి రప్పించిందని వివరించారు.

తన కుమారుడు కి జ్యుస్ లో మత్తు మందు ఇచ్చి నిత్యం మత్తు లో ఉంచేదని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ అనేక ప్రాంతాల్లో తిప్పి అనేక ఇబ్బందులు గురిచేసింది. నిందితురాలు పెట్టిన ఇబ్బందులతో నా కుమారుడు వాయిస్ మెసేజ్ ద్వారా మాకు తెలియజేశారు. ఈ విషయంలో పోలీసు కమిషనర్ శంకబత్రబగ్చి మాకు చాలా సహాయం చేసారు. ఇప్పటికే జమిమా బాధితులు నలుగురు కేసులు పెట్టారు. పరువు పోతుంది అని చాలామంది బయటకు రావడం లేదు అని బాధిత తల్లి లక్ష్మీ తెలిపారు. ఈ కేసు ను లోతుగా విచారణ చేయాలని సీపీని ఆమె కోరారు.

Related posts

మండుటెండలో ఎన్టీఆర్ కు టీడీపీ నివాళి…!

mamatha

కన్నతండ్రే హంతకుడు: సత్యంన్యూస్ చెప్పిందే నిజమైంది

Satyam NEWS

స్ఫూర్తి జితేందర్ “ఐ ఫీల్ యు” ఆల్బమ్ పోస్టర్ ఆవిష్కరణ

mamatha

Leave a Comment