37.2 C
Hyderabad
March 28, 2024 21: 00 PM
Slider నిజామాబాద్

న్యూ వేవ్: కొత్త చట్టాలతో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి

prashanth reddy

దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన పంచాయతీ, మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజాప్రతినిధులు, అధికారులకు చట్టాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ చట్టాల ద్వారా గ్రామాలు పట్టణాల అభివృద్ధిలో వేగం పుంజుకుంటాయని చెప్పారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హల్ లో గురువారం పంచాయతీ రాజ్, పురపాలక సంఘం ప్రగతి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… రెండు విడతల పల్లె ప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో మార్పు వచ్చిందని తెలిపారు.

గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశం ఆషామాషీ కాదన్నారు. పల్లెల ప్రగతి, పట్టణ ప్రగతి చాలా ముఖ్యమైనదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో నుంచి పుట్టిన ఆలోచన ఈ కార్యక్రమమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజకీయ ఉచ్చులో పడి చేయాల్సిన పనులను మరిచి ఇతర కార్యక్రమాలు చేసుకుంటున్నామని అన్నారు. దీనివల్ల ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల తేలిక భావన ఏర్పడిందన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల పట్ల ప్రజలకు ఉన్న భావం మారిందని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అని చెప్పారు. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు మాత్రమే కాదని, 5 సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ పంచాయతీలకు ప్రతి నెల నిధులు సకాలంలో చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు.

పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని పని చేయాలని చెప్పారు. అనంతరం గాంధారి గ్రామ పంచాయతీలో ఉన్న నివాసాల వివరాలు, వారికి ఇవ్వాల్సిన మొక్కల వివరాలను పంచాయతీ కార్యదర్శిని మంత్రి అడగగా సరైన వివరాలు చెప్పకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులకు సరైన సమాచారం తెలియడం లేదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పక్కనే ఉన్న కలెక్టర్ శరత్ కు సూచించారు.

అనంతరం ప్రగతి పనులపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ ధఫెదర్ శోభ రాజు, ఎంపీ బిబిపాటిల్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్లు నిట్టు జాహ్నవి, గంగాధర్, కుడుముల సత్యం, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, కలెక్టర్ శరత్ కుమార్, అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దొత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్రపతిపై మంత్రి వ్యాఖ్యలకు మమత క్షమాపణ

Satyam NEWS

మియాపూర్ మహిళల ఆధ్వర్యంలో ఆవిర్భావదినం

Satyam NEWS

ప్రజలందరికి శ్రీ తిరుపతమ్మ తల్లి దీవెనలు ఉండాలి

Satyam NEWS

Leave a Comment