తెలంగాణా సచివాలయం సంఘo ఆధ్వర్యంలో నూతన సంవత్సరo 2025 క్యాలెండరు ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొ. కోదండరాం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉద్యోగులు ఫైల్స్ విషయం లో ఆలస్యo చేయకుండా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమo కోసం కట్టుబడి ఉంది అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తో కలిసి పనిచేద్దాం అని తెలిపారు. ముఖ్యoగా ఉద్యోగుల పెండింగ్ బిల్స్, హెల్త్ కార్డ్స్ కోసం తన వైపున నుండి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఉద్యోగుల సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకొని రావాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సంఘం ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ ప్రేమ్ పాల్గొన్నారు.
previous post
next post