నీతి, నిజాయితీ, జర్నలిజం, నిష్పాక్షికత…. అంతా ట్రాష్. డబ్బు, కులమే ఈ ఎల్లోమీడియాకు ముఖ్యం- ఇదేదో కసితో చెబుతున్నది కాదు సుమా. అక్షర సత్యం. ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు కూడా కాలేదు, ఈ మీడియా అంతా కట్టకట్టుకుని ఎందుకు విరుచుకుపడుతున్నది? ఈ ప్రశ్న నుంచి సత్యం న్యూస్ కొంచెం లోపలికి వెళ్లి తొంగి చూస్తే పై విషయం వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పెద్దలు అధికారంలో ఉన్న కాలంలో దాదాపు నాలుగేళ్ల పాటు కమలనాథులతో అంటకాగారు.
ఆ తర్వాత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అక్కడ మోడీ హవా తగ్గుతున్నట్లు చూచాయగా కనిపించింది. అంతే దేశం మొత్తంలో మోడీ హవా జీరోకు వచ్చిదనుకుని మోడీపై పోరాటం మొదలు పెట్టారు. అప్పటి వరకూ కప్పి పెట్టిన ప్రత్యేక హోదా విషయం మళ్లీ బయటకు తెచ్చారు. ధర్మ పోరాట దీక్ష అంటూ కొత్త డ్రామా ప్రారంభించారు. ప్రభుత్వం తరపున నిర్వహించిన ఈ దీక్షలకు ప్రచారం కల్పించటానికి, దీక్షలు నిర్వహించటానికి కేవలం 18 నెలల కాలంలో సుమారు 200 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్లు తెలుస్తోంది.
ఈ ధర్మ పోరాట దీక్షలా ద్వారా ప్రజలకు ఒరిగింది ఏమిటో తెలియదు కానీ ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలకు మాత్రం భారీగా ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది. ఈ ధర్మ పోరాట దీక్షలు రాష్ట్రంలోముఖ్యమైన ప్రాంతాలు తో పాటు దేశ రాజధాని ఢిల్లీలోను నిర్వహించారు. ఈ దీక్షలలో చంద్రబాబు ప్రసంగాలు ప్రతి గ్రామానికి చేరే విధంగా నేరుగా ప్రసారం చేయటానికి (లైవ్ టెలీ కాస్ట్ )కోట్లాది రూపాయాలు వెచ్చినట్లు తెలుస్తోంది. దీనితోపాటు కొన్ని పత్రికలకు కోట్లాది రూపాయలు ప్రకటనల ను విడుదల చేశారు.
ఈ విధంగా గత ప్రభుత్వం జారీచేసిన ప్రకటనలకు సుమారు 180 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థి నెలకొంది. ఎన్నికలలో ఎలాగైనా గెలవాలనే తపనతో అనేక ప్రజాకర్షణ పథకాలకు వివిధ మార్గాల నుంచి కోట్లు రూపాయలు విడుదల చేయడంతో ప్రస్తుత ఖజానా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితికి చేరుకుంది. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని రాజకీయంగా గగ్గోలు పెట్టి దానికి నిరసనగా ధర్మ పోరాట దీక్షలు చేయడమేమిటి? దాని ప్రచార ఆర్భాటానికి కోట్లా రూపాలు వెచ్చించటం ఏమిటి. దాని ద్వారా సొంత డబ్బా కొట్టుకోవటానికి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం, ఆ భారం కొత్త ప్రభుత్వంఫై పడటం ఏమిటి?
ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ఛానెళ్లు, ఒక వర్గం మీడియాకు ప్రకటనల రూపంలో కనక వర్షం కురిసింది. పెద్ద పత్రికలు, చిన్న పత్రికలూ అనే తేడా లేకుండా మనవాడు ఐతే చాలు ప్రకటనలు ఇచ్చేయ్ అన్న చందంగా ప్రకటనలు విడుదల చేశారు. అయితే వీటి చెల్లింపులులను పక్కన పెట్టి పసుపు, కుంకుమ వంటి ఇతర సంక్షేమ పథకాలకు డబ్బులు విడుదల చేయటంతో పత్రికలకు చెల్లింపులు జరగలేదని తెలిసింది. దేశ రాజధానిలో దీక్ష చేస్తే దానిని నిరంతరం ప్రసారం చేయాలని చెప్పి కొన్ని చానళ్లకు కోట్లాది రూపాయలు ప్రకటనల రూపంలో కేటాయించటం, జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చే విధంగా దుబారా చేయటంతో కోట్లాది రూపాయలు అనవసరం గా వ్యయం చేశారు.
ప్రస్తుతం ఈ ప్రకటనలకు చెందిన బిల్లులు పెండింగు లో పడటంతో కొత్త ప్రభుత్వం ఫై దుష్ప్రచారం మొదలు పెట్టారు. జగన్ ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత వచ్చిందని, ప్రభత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని, పోలవరం పైనా, అమరావతి పైనా పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసేస్తున్నారు. ఈ బిల్లులతో బాటు కులం గొడవ ఒకటి.