29.2 C
Hyderabad
September 10, 2024 16: 50 PM
Slider ప్రపంచం

వెనెజువెలా అధ్యక్షుడిగా నికోసల్‌ మడురో ఎన్నిక

#nicolasmaduro

వెనెజువెలా అధ్యక్షుడిగా నికోసల్‌ మడురో మరోసారి భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ నేషనల్‌ ఎలక్టోరల్‌ కౌన్సిల్‌ అధిపతి ఎల్విస్‌ అమోరోసో ప్రకటించారు. మొత్తం 80శాతం ఓట్లను లెక్కించగా మడురోకు 51.20శాతం పోలైనట్లు తేలింది. ఆయన ప్రధాన ప్రత్యర్థికి కేవలం 44.02శాతమే లభించాయి. ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఫలితాలను న్యాయస్థానంలో సవాలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ తమ అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు మద్దతుగా ఏకమయ్యాయి.

ప్రతిపక్షం ఇప్పటికే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వేల మంది మద్దతుదారులను పిలిపించాయి. వారు కౌంటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఫలితాలను ప్రకటించేందుకు ఇలా చేసింది. కానీ, పోలీసులు చాలా కేంద్రాల నుంచి వీరిని వెళ్లగొట్టారని గోంజాలెజ్‌ వర్గం వెల్లడించింది. ఆదివారం అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. వేతనాల్లో కోత, ఆకలికేకలు, వలసలు, చమురు పరిశ్రమలో సంక్షోభం వంటి సమస్యలతో కునారిల్లుతున్న వెనెజువెలాలో మొత్తం ఓటర్లు దాదాపు 1.70 కోట్లు. ప్రజా వ్యతిరేకతను మడురో కూడగట్టుకొన్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

బరిలో ఎనిమిది మంది అభ్యర్థులున్నా మడురో, గొంజాలెజ్‌ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ఎన్నికల ముందు జరిగిన ఒపీనియన్‌ పోల్స్‌లో మడురోపై గోంజాలెజ్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించింది. అధికారిక సోషలిస్టు పీఎస్‌యూవీ పార్టీని మార్చాలని తాము భావిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.

Related posts

క్యాండిల్ లైట్: నిజామాబాద్ లో రేపు నర్సుల ర్యాలీ

Satyam NEWS

11 నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్  ‘శంఖారావం’

Satyam NEWS

హైకోర్టు తరలింపునకు వ్యతిరేకంగా అవనిగడ్డలో దీక్షలు

Satyam NEWS

Leave a Comment