39.2 C
Hyderabad
April 25, 2024 15: 37 PM
Slider ఆదిలాబాద్

నిర్మల్ జిల్లాలో రాత్రి పూట కర్ఫ్యూ విధింపు

#Nirmal Collector

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిర్మల్ జిల్లాలో కర్ఫ్యూ        విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్  ఫారూఖీ  అన్నారు.

మంగళ వారం జిల్లా పాలనాధికారి  సమావేశ  మందిరం లో  ఏర్పాటు చేసిన  ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జీ.ఒ.నెం.87 ప్రకారం ఈ రోజు నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు ప్రతి రోజూ రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు మూసివేయాలని,  కర్ఫ్యూ నుంచి మీడియాకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. సమాచార   సేకరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఫార్మసీలు, ల్యాబ్‌లు, పెట్రోల్‌ బంక్‌లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని తెలిపారు.

టికెట్‌ కలిగిన విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చామని తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని  తెలిపారు.

జిల్లాలో  1100 పడకలు కొవిడ్  ట్రీట్మెంట్  బెడ్లు ఏర్పాటు చేశామని, కొవిడ్ టెస్టింగు  రోజుకు  2000   జరుగుతున్నాయని,    రాబోయే రెండు వారాలలో ఆర్ టి పి సి ఆర్   ల్యాబ్  ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా రోజుకు  6వేల  నుండి  7వేల  వరకు కరోనా టీకాలు ఇస్తున్నామని తెలిపారు.

ఇన్ఛార్జి ఎస్పి  ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ ఎమైన  సమస్య లు ఉంటె  కంట్రోల్  రూమ్  నంబ ర్    9440900680 కాల్  చెయాలని  అన్నారు. ఈ కార్యక్రమం లో  అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడె  జిల్లా వైడ్యాధికారి ధన్రాజ్   సుపరెండే  దేవేంద్ర రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

టెన్షన్ టెన్షన్: ఆ రెండు పదవుల కోసం భారీ క్యూ

Satyam NEWS

శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి బందోబస్తు

Satyam NEWS

ఆంధ్ర అధికారులతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment