28.7 C
Hyderabad
April 25, 2024 04: 00 AM
Slider ప్రత్యేకం

లా కారిడార్: హైకోర్టులో జగన్ సర్కార్ పిల్లిమొగ్గ

#Y S Jaganmohan Reddy

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు ఉంది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకోగానీ తమ తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దాఖలు చేసిన వెంటనే మళ్లీ ఆ పిటీషన్ ను ఉపసంహరించుకున్నది. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడం వల్లనే హైకోర్టులో స్టే ఇవ్వాలనే పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో రిటైర్డ్  జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకున్నారు.

డాక్టర్ ఎన్ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ మే 29న హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన పదవి కాలాన్ని కుదిస్తూ తెచ్చిన ఆర్డినెన్సును, సంబంధిత జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం అలాంటి ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

ఎన్నికల సంస్కరణలలో భాగంగా తాము ఈ పని చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నది. అయితే తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించేందుకే ఆ ఆర్డినెన్సు తీసుకువచ్చారని రమేష్ కుమార్ కోర్టులో తన వాదన వినింపించారు.

ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు కొట్టేయడంతో  రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలను తిరిగి స్వీకరించారు. ఆర్డినెన్సు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేకపోతే రమేష్ కుమార్ ను నియమించింది కూడా ఆ నాటి రాష్ట్ర ప్రభుత్వమే కదా అనే వాదనను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం మీడియాతో ఇదే విషయాన్ని చెప్పారు. సుప్రీం కోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించుకున్నట్టు కూడా ఆయన తెలిపారు. ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్లు కూడా ఆయన గుర్తు చేశారు.

అయితే అకస్మాత్తుగా హైకోర్టులోనే స్టే పిటిషన్ ఎందుకు దాఖలు చేశారో తెలియదు. మళ్లీ ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలియదు. ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వ్యవహారంలో వత్తిడితో ఉన్నట్లు అర్ధం అవుతున్నది.

Related posts

ప్రధాని జన్మదినం సందర్భంగా అర్వింద్ సేవా సప్తాహం

Satyam NEWS

సిబిఐటి మెకానికల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Satyam NEWS

రాబంధు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే దమ్ముందా కేసీఆర్..

Satyam NEWS

Leave a Comment