33.2 C
Hyderabad
April 26, 2024 02: 51 AM
Slider జాతీయం

ఎక్సటెన్షన్ :నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి

nirbhaya cell

నిర్భయ దోషుల ఉరిశిక్షకు తేదీ ఖరారైంది.ఈ మేరకు డెత్ వారెంట్ జారీ అయింది. ఫిబ్రవరి 1వ తేదీని ఉదయం 6 గంటలకు వారికి ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో నలుగురు దోషులను ఉరి తీయనున్నారు. దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడం తో ఉరిని ఖరారు చేశారు.
చట్టం ప్రకారం క్షమాభిక్షను నిరాకరించిన పక్షంలో చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించడానికి రెండు వారాల గడువు ఉండాలి. సరిగ్గా క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించిన ఈ రోజునుండి 14వ రోజున ఉరిశిక్షను అమలు చేయబోతున్నారు. వాస్తవానికి ఈనెల 22న నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉందగా క్షమాభిక్ష పిటిషన్ నేపథ్యంలో దోషులకు మరో 10 రోజులు ఎక్కువ జీవించే అవకాశం కలిగింది.

Related posts

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మళ్లీ రాహుల్ గాంధీ

Satyam NEWS

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెలుగుదేశం ధర్నా

Satyam NEWS

రోడ్డెక్కి ముగ్గులేసిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతు కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment