37.2 C
Hyderabad
March 29, 2024 19: 34 PM
Slider జాతీయం

ఆపర్చునిటీ:నిర్భయ దోషుల ఉరిశిక్షపై కోర్టు స్టే

nirbhaya-mock-hanging.jpg

తెల్ల వారితే ఉరి శిక్ష అనగా నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా నిర్భయ దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే.

అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలును వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు పంపింది. ఇక ఇదే కేసులో దోషి అక్షయ్‌ వేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అదే విధంగా కేసులో మరో దోషి అయిన పవన్‌ గుప్తా ఘటన జరిగే నాటికి తాను మైనర్‌ అంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Related posts

వరి పంట సాగు వద్దంటే రైతులు ఉరి వేసుకోవాలా?

Satyam NEWS

కరోనా పీడితుల సేవలో మై వేములవాడ వాట్సాప్ గ్రూప్

Satyam NEWS

తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లో ర్యాగింగ్ భూతం

Satyam NEWS

Leave a Comment